Thamannaa: వామ్మో ఇదే మీ డ్రస్సు తమన్నా… అంటూ తమన్నా డ్రెస్ గురించి భారీగా కామెంట్లు చేస్తున్న నెటిజన్లు!

Thamannaa: ఇండస్ట్రీలోకి వచ్చి 16 సంవత్సరాలు అవుతున్న తెలుగు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దంన్నర కాలం పూర్తయినప్పటికీ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు. తమన్నా కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా తమన్నాకు సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈమె ధరించిన డ్రెస్ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. తమన్నా ధరించిన డ్రెస్ మెరుస్తూ ఇంద్రధనస్సు రంగులతో పోలి ఉండటమే కాకుండా ఆమె శరీరానికి అనుగుణంగా ఉండటంతో చాలా మంది నెటిజన్లు ఈ ఫోటో పై కామెంట్లు చేస్తున్నారు. ఇలా మెరుస్తుంది అంటే ఇది డ్రెస్ ఆ లేక కరెంటు తీగలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తమన్నాకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక సినిమాల విషయానికొస్తే తమన్నా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమాలో నటిస్తున్నారు. అలాగే చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ సరసన సందడి చేయనున్నారు.ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి తమన్నా కాంబినేషన్లో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.