టాక్ : “రాధే శ్యామ్” నుంచి బిగ్ అప్డేట్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కంప్లీట్ చేసేసిన సినిమాలు ఇప్పుడు రెండున్నాయి. వాటిలో ఒకటి రాధే శ్యామ్ కాగా ఇంకొకటి ఆదిపురుష్. అయితే వీటిలో రాధే శ్యామ్ ఆల్రెడీ అన్ని పనులు ముగించుకొని రిలీజ్ కి కూడా రెడీగా ఉంది. కానీ అప్డేట్స్ మాత్రం నత్త నడక గానే ఉన్నాయి. దీనితో అసలు సినిమా జనవారిలోనేనా అని అనేక అనుమానాలు మొదలయ్యాయి.

ఇదిలా ఉండగా సినిమా నుంచి మొదటి పాట కోసం అంతా ఎప్పుడు నుంచో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదు. కానీ ఇప్పుడు మాత్రం దానికి టైం దగ్గర పడినట్టే తెలుస్తుంది. ఈ కొద్ది వ్యవధిలోనే సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ రావచ్చట. దానిపైనే సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ నడుస్తుంది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.