భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న.. టిక్ టాక్ భాను!

టిక్ టాక్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్, ఇన్ స్టా రీల్స్ ద్వారా ఎంతోమంది బాగా పాపులర్ అయ్యరు. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన చాలామందికి ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వచ్చాయి. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యి జబర్దస్త్ లో అవకాశం పొందిన వారిలో టిక్ టాక్ భాను కూడా ఒకరు. చాలాకాలంగా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షో లలో సందడి చేస్తున్న భాను ఈ షోస్ లో కూడా మంచి గుర్తింపు పొందింది. జబర్థస్త్ భాను అంటే గుర్తు రాకపోవచ్చు..కానీ టిక్ టాక్ భాను అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు. మరి సోషల్ మీడియాలో భానుకి ఉన్న ఫాలోయింగ్ అటువంటిది. సోషల్ మీడియాలో భాను ఏకంగా 1.5 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.

ఇలా సోషల్ మీడియాలో పాపులర్ అయిన భానుకి హైపర్ ఆది జబర్దస్త్ లో అవకాశం కల్పించాడు. ఆది చేసే స్కిట్లలో ఆదికి జోడిగా భాను సందడి చేస్తోంది. ఇలా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వరుస ఎపిసోడ్స్ లో భాను సందడి చేస్తూ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలో ఈమెకు సినిమాలలో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. ఒకవైపు సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తూ మరొకవైపు సినిమా లలోనూ, టీవి షోస్ ద్వారా భాను మంచి గుర్తింపు పొందింది. ఈ క్రమంలో ఈ అమ్మడు ఆదాయం కూడా భారీగానే ఉంది. జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ కోసం మల్లెమాల వారి నుండి భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో సందడి చేస్తునందుకు ఒక్కరోజు కాల్ షీట్ కోసం ఈమెకు రూ. 1.25 వేల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సినిమాలలో వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ బుల్లితెర మీద కనిపించటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇక సినిమాలలో హీరోయిన్ గా కూడా అవకాశాలు వస్తున్నాయి. గతంలో జబర్థస్త్ నుండి సినిమాల వైపు వెళ్ళిన వారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అందరికీ తెలుసు. అందువల్ల సినిమాల వైపు వెళితే బుల్లితెర మీద అవకాశాలు తగ్గుతాయని , అందువల్ల సినిమాల వైపు వెళ్ళటం లేదని సమాచారం. ఇలా బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోస్ లో సందడి చేయడంతో ముందు ముందు ఈమెకు డిమాండ్ పెరిగి రెమ్యూనరేషన్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.