తాప్సీ బాయ్‌ఫ్రెండ్ ఇత‌గాడే.. పెళ్లి త‌ర్వాత సినిమాలు త‌గ్గిస్తాన‌న్న సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన సొట్టబుగ్గల సుంద‌రి తాప్సీ. త‌మిళంలోను ప‌లు భాష‌ల‌లో న‌టించిన తాప్సీకు సౌత్‌లో పెద్ద‌గా గుర్తింపు రాలేదు. దీంతో బాలీవుడ్ ఫ్లైటెక్కిన ఈ ముద్దుగుమ్మ అక్కడ ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌లో నటించింది. ఆ చిత్రాల‌లో తాప్సీకు మంచి పేరు రావ‌డంతో స్టార్‌డ‌మ్ సంపాదించింది. దీంతో ఇప్పుడు తాప్సీ వెనుక ఆఫ‌ర్స్ క్యూ క‌డుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ర‌ష్మీ రాకెట్‌, శ‌భాష్ మిథు, త‌మిళం‌లో జ‌న‌గ‌ణ‌మ‌న, ఇలా ప‌లు చిత్రాలు చేస్తుంది.

ర‌ష్మీ రాకెట్ చిత్రంలో అథ్లెట్‌గా క‌నిపించ‌నున్న తాప్సీ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వ‌ర్క్ చేసింది. అథ్లెట్‌గా క‌నిపించేందుకు నానా క‌ష్టాలు ప‌డింది. ఇప్పుడు మిథాలీ రాజ్ బ‌యోపిక్ కోసం క్రికెట్ షాట్స్ ప్రాక్టీస్ చేస్తుంది. మిథాలీ శిక్ష‌ణ‌లోనే బ్యాటింగ్ మెలుకువలు నేర్చుకుంటుంది. అయితే ఈ అమ్మ‌డు కొద్దిరోజులుగా డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయెతో రిలేష‌న్ షిప్‌లో ఉంది. వీరిద్ద‌రు చ‌క్క‌గా చెట్ట‌ప‌ట్టాలు వేసుకుంటూ వాటికి సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌కు ఆనందాన్ని ఇస్తున్నారు.

తాజాగా త‌న రిలేష‌న్ షిప్‌పై మాట్లాడిన తాప్సీ.. సినిమాకు సంబంధించిన వ్య‌క్తిని పెళ్లి చేసుకోనుంది. వ్య‌క్తిగ‌తం, వృత్తి రెండు వేరువేరు. నాకు సంబంధించిన వారి పుట్టిన రోజు వేడుక‌ల‌లో పాల్గొన్న‌ప్పుడు ఏదో ఒక ఫొటో షేర్ చేస్తాను. ఇప్పుడు మ‌థియాస్ విష‌యంలో అదే జ‌రిగింది. పెళ్లి త‌ర్వాత సినిమాలు త‌గ్గించి వ్య‌క్తిగ‌త జీవితంపై దృష్టిపెడ‌తాను, ప్ర‌స్తుతానికి అయితే నా ఫోక‌స్ అంతా సినిమాల‌పైనే ఉంది అని చిల‌క‌ప‌లుకులు ప‌లికింది తాప్సీ.