డిజిటల్ రిలీజ్ కి  రెడీ అయిన “స్వాతిముత్యం”

బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు, శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అయిన తొలి మూవీ  ‘స్వాతి ముత్యం’. ఈ సినిమా కొన్ని వారాల క్రితం థియేటర్ లో రిలీజ్ అయ్యి విమర్శకుల నుండి మంచి ప్రశంసలను పొందింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఊహించిన రేంజ్ లో హిట్ అవ్వలేదు. తాజా అప్డేట్ ప్రకారం ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతోంది.

వర్ష బొమ్మల హీరోయిన్ గా నటించిన ‘స్వాతి ముత్యం’ మూవీ  ఈ నెల 28 నుండి ఆహా వీడియో లో ప్రసారం కానుంది. ఈ మూవీ కి లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వం వహించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్య దేవర నాగ వంశీ ప్రొడ్యూసర్ చేసాడు.  ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.