Akhanda: అఖండ సినిమా చూసిన స్వామిజీ.. ఏమన్నారంటే..?

Akhanda: అఖండ సినిమా చూసి కుటుంబమంతా చాలా ఎంజాయ్‌ చేయొచ్చని బాలకృష్ణ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెయిన్‌గా ఫైట్స్‌ చూస్తుంటే ఒళ్లు దలధరిస్తోందని మరికొందరు అంటున్నారు. అసలు బాలకృష్ణ క్యారెక్టర్‌కి పేరు పెట్టేదేమీ లేదని, ఆయన చేసిన అఘోరా పాత్ర చాలా హైలెట్‌ అని నందమూరి అభిమానలు ఆ సినిమాను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా లెజెండ్ సినిమాను మించి ఈ సినిమాలో క్లైమాక్స్ ఉందని వారు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

మరికొందరేమో బోయపాటి ఈ సినిమా కథను చాలా చక్కగా రాశారని, ఓ రకంగా చెప్పాలంటే రాజమౌళి కూడా ఇలాంటి సినిమా తీయలేరని అభిమానులు ఆయన్ని తెగ పొగిడేస్తున్నారు. సినిమాను మైండ్‌కి ఎలా ఎక్కించాలో అలా ఎక్కించారని కూడా వారు చెప్తున్నారు. ఈ సినిమాను మిగతా హీరోలు కూడా చూడాలని, వారందరికీ కూడా ఈ చిత్రం బాగా నచ్చుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్‌గా ఈ సినిమా సూపర్ హిట్‌ అని నందమూరి అభిమానులు బిరుదు కూడా ఇచ్చేశారు.

అంతేకాకుండా తప్పుడు దారిలో వెళ్లకూడదు. సమభావంలో వెళ్లాలి. ఎప్పుడూ ఒక పద్ధతిని అలవర్చుకోవాలి అనే విషయాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారని ఆ సినిమా చూసిన ఓ స్వామిజీ కూడా చెప్పడం చెప్పుకోదగిన విషయం. అంతేకాదు అఘోరాగా బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందని ఆయన వివరించారు. ధర్మం కోసం పాటు పడాలి అనే సందేశం ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు బాగా చూపించారని ఆయన చెప్పారు. దాంతో పాటు బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ అందర్నీ ఆదరిస్తుందని ఆయన తెలిపారు.