Nara Lokesh: తప్పేముంది… లోకేశ్ కు డిప్యూటీ ఇస్తే తప్పులేదు: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ

Nara Lokesh: ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం గా పదవి ఇవ్వాలి అంటూ ఏక కంఠంతో మాట్లాడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వీరి మాటలు వెనక ఎవరైనా ఉన్నారా లేకపోతే వీరే స్వయంగా అలాంటి ఆశలు పెట్టుకున్నారా అనే విషయం తెలియదు కానీ వరుసగా తెలుగుదేశం పార్టీ నేతలు అందరూ కూడా మీడియా ముందుకు వస్తూ లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ తరపున నాయకత్వం వహిస్తున్నటువంటి నేత వర్మ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇస్తే తప్పేంటి అంటూ మాట్లాడారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవటనికి వర్మ కీలక పాత్ర పోషించారు ఈ క్రమంలోనే లోకేష్ కు డిప్యూటీ ఇస్తే తప్పేంటి అంటూ వర్మ మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారాయి.

ఇందుకు గాను ఈయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు. మొన్నవరదలు వచ్చిన సమయంలో జగన్మోహన్ రెడ్డి బయటకు రావడంతో వైకాపా పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా సీఎం అంటూ నినాదాలు చేశారు అంటే వారికి తమ నాయకుడు సీఎం అయితే చూడాలని ఆశ ఉంటుంది. అలాగని చంద్రబాబు నాయుడుని వెంటనే సీఎం పదవి నుంచి తీసేసి జగన్మోహన్ రెడ్డిని అక్కడ కూర్చో పెట్టమని కాదు కదా అని తెలిపారు.

లోకేష్ కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు ఇస్తే తప్పేముందని అన్నారు. పార్టీలు మనుగడ సాధించాలన్నా, బలపడాలన్న కార్యకర్తల మాట పార్టీ అధినేత వినాలన్నారు. కష్టకాలంలో పార్టీకి వెన్నుముకగా నడిచింది లోకేష్ అని గుర్తు చేశారు.పార్టీలో కరుడుగట్టిన కార్యకర్తలు ఉన్నారని, వారి కోరిక మేరకు డిప్యూటీ సీఎంగా ప్రకటిస్తే బాగుంటుందన్నారు. భవిష్యత్‌లో పార్టీ యువతకు భరోసా ఇచ్చేందుకు ముందుగా పదవి ఇవ్వాలని తెలియజేశారు. ఏది ఏమైనా డిప్యూటీ సీఎంగా పవన్ కొనసాగటం వర్మకు ఇష్టం లేదని ఈ విధంగా తన మనసులో మాటను బయటపెట్టారని చెప్పాలి.