‘భూతాల బంగ్లా’’ రోలర్ కోస్టర్ ఫన్ రైడ్ : ప్రెస్ మీట్ లో హీరో సంతానం

మన్మధ, నేనే అంబానీ, రాజు రాణి.. ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు సుపరిచతమైన పాపులర్ యాక్టర్ సంతానం హీరోగా నటించిన హిలేరియస్ యూనిక్ హారర్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డీడీ రిటర్న్స్’. సురభి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి యస్. ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఆర్కే ఎంటర్‌టైన్‌మెంట్ పై సి. రమేష్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం జులై 29న తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రతిష్టాత్మక నిర్మాణ, డిస్ట్రిబ్యుషన్ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాతలు ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఆగష్టు 18న ఈ చిత్రాన్ని ‘డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా’’ పేరుతో తెలుగులో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో యూనిట్ తెలుగు ట్రైలర్ ని లాంచ్ చేసింది.

ప్రెస్ మీట్ లో హీరో సంతానం మాట్లాడుతూ.. ‘డీడీ రిటర్న్స్’ తమిళ్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నా సినిమా తెలుగులో విడుదల చేయడం నా డ్రీం. మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూశాను. సినిమా విడుదలైతే అందరూ ఎంజాయ్ చేసేలా వుండాలని అనుకున్నాను. ఇప్పుడు ‘డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా’’ చిత్రంతో తెలుగులోకి రావడం ఆనందంగా వుంది. అందరూఎంజాయ్ చేసే చిత్రమిది. తెలుగు ప్రేక్షకులకు రియల్ సినిమా లవర్స్. ఇక్కడి ప్రేక్షకుల ప్రేమ ప్రోత్సాహంతో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ని సాధించింది. ఒక మంచి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆర్ బి చౌదరి గారు , ఎన్ వి ప్రసాద్ గారి కి ధన్యవాదాలు. ‘భూతాల బంగ్లా’’ చిత్రం ఒక రోలర్ కోస్టర్ ఫన్ రైడ్. హారర్ కామెడీ విత్ గేమ్ తో వున్న ఈ చిత్రాన్ని పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా యునిక్ గా వుంటుంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఆగస్ట్ 18 ఈ చిత్రం మీ ముందుకు వస్తోంది. ఈ మంచి చిత్రాన్నితెలుగు ప్రేక్షకులు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.

సురభి మాట్లాడుతూ.. తమిళనాడులో డీడీ రిటర్న్స్ పెద్ద హిట్ అయ్యింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాం. మీ అందరితో కలసి ‘డీడీ రిటర్న్స్’ ని థియేటర్ లో చూడటానికి ఎక్సయిటెడ్ గా వున్నాను. సంతానం గారితో పని చేయడం గొప్ప అనుభవం. దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. టీం అంతా కలసి చాలా హార్డ్ వర్క్ చేశాం. అందరూ ఆగస్ట్ 18న ఈ చిత్రాన్ని థియేటర్ లో చూడాలి’’ అన్నారు

దర్శకుడు యస్. ప్రేమ్ ఆనంద్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి చిత్రం. తమిళ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం ఆనందంగా వుంది. ఈ చిత్రం తెలుగులో విడుదల కావడం గౌరవంగా భావిస్తున్నాను. రమేష్ గారి, ఎన్వీ ప్రసాద్ గారికి, ఆర్బీ చౌదరి గారికి ధన్యవాదాలు. సంతానం గారికి తెలుగు ప్రేక్షకులతో ఎంతో మంచి అనుబంధం వుంది. రాజమౌళి గారి ఈగ తమిళ్ వెర్షన్ సంతానం గారు కీలక పాత్ర పోషించారు. దానికి నేను డైలాగ్స్ రాశాను. ఇప్పుడు అదే టీం ఈ చిత్రానికి డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. యస్. డీడీ రిటర్న్స్ చాలా జాయ్ ఫుల్ మూవీ. ఫ్యామిలీ, కిడ్స్ ప్రత్యేకంగా ఎంజాయ్ చేస్తారు. ఆగస్ట్ 18న సినిమా విడుదలౌతుంది. అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి’’ అని కోరారు.

రమేష్ కుమార్ మాట్లాడుతూ.. డీడీ రిటర్న్స్ తమిళంలో ఘన విజయం సాధించింది. తెలుగులో డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా’’ పేరుతో ఆగస్ట్ 18 రిలీజ్ అవుతుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి.’’ అని కోరారు

ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. జులై 29న తమిళంలో విడుదలైన ఈ చిత్రం సంతానం కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దాదాపు నలభై కోట్లు వసుళూ చేసింది. ఇంటిల్లాపాది చూడదగ్గ చిత్రమిది. తమిళ్ లానే తెలుగు ప్రేక్షకులకు కూడా ఇది బాగా నచ్చుతుంది. మంచి కంటెంట్ వుంటే తెలుగు ప్రేక్షకులకు గొప్పగా ఆదరిస్తారు. ఎన్నో డబ్బింగ్ చిత్రాలు మనకి ఆల్ టైం రికార్డ్ వచ్చాయి. ఆ కోవలోనే డీడీ రిటర్న్స్ భూతల బంగ్లా సంచలన విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది’’ అన్నారు.

వాకాడ అప్పారావు మాట్లాడుతూ.. ట్రైలర్ అద్భుతంగా వుంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని సక్సెస్ చేసి కొత్తగా వస్తున్న నిర్మాతలని ప్రోత్సహించాలి’ కోరారు.