Crime News: కానిస్టేబుల్ పై కేసు నమోదు అవ్వటంతో సస్పెండ్.. చివరికి గంజాయి స్మగ్లర్ గా..!

Crime News: ఉన్నతమైన పోలీసు పదవిలో ఉంటూ ప్రజలను పోలీసులు నేరాలకు పాల్పడుతున్నారు.ఈ మద్య కాలంలో ఇలా ఎంతో మంది పోలీసులు నేరాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వారు చేస్తున్న నేరాలు రుజువై ఉద్యోగం కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవల ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే…తూర్పుగోదావరి జిల్లా, రాజవొమ్మంగి మండలం గూడెంకొత్తవీధికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సత్యనారాయణకు కాకినాడ ఏపీఎస్పీ మూడో బెటాలియన్‌లో చేస్తున్న సమయంలో భార్యతో గొడవ జరిగి ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఉన్నతాధికారులు సత్యనారాయణను సస్పెండ్ చేశారు. 2020లో సత్యనారాయణ లో ఉద్యోగం నుంచి తొలగించారు. ఉద్యోగం పోవటం తో తీవ్ర వేదనకు గురైన సత్యనారాయణ మత్తు పదార్థాలకు బాగా అలవాటు పడ్డాడు.

విలాసాలకు అలవాటు పడిన సత్యనారాయణ నగదు కోసం ఏజెన్సీలో గంజాయిని కొని రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో అమ్మేవాడు. సులభంగా డబ్బు సంపాదించడం కోసం గంజాయిని సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో 4.3 కేజీల గంజాయిని సురేంద్ర అనే వ్యక్తి ద్వారా నామవరం శాటిలైట్‌ సిటీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి విక్రయించేందుకు సత్యనారాయణ ప్రయత్నించాడు. ఈ విషయం గురించి పోలీసులకు ముందే సమాచారం అందడంతో పక్కా ప్రణాళికతో సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేశారు.