విరాటపర్వం ట్రైలర్ పై స్పందించిన రోలెక్స్ స్టార్ సూర్య.. ట్వీట్ వైరల్!

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి రానా ప్రధాన పాత్రలలో నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.ఈ క్రమంలోనే ఈ సినిమాని జూన్ 17వ తేదీ విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేయగా ట్రైలర్ విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కేవలం ప్రేక్షకులు, అభిమానులు మాత్రమే కాకుండా పలువురు సెలబ్రిటీలు సైతం ఈ ట్రైలర్ పై స్పందిస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కాగా నటుడు సూర్య సినిమా ట్రైలర్ పై స్పందించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే విరాటపర్వం ట్రైలర్ పై స్పందిస్తూ తనదైన శైలిలో తన అభిప్రాయాలను తెలియజేశారు.

సూర్య కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో చివరి మూడు నిమిషాలు రోలెక్స్ పాత్రలో నటించి అద్భుతమైన ఆదరణ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే గత నాలుగు రోజుల నుంచి సూర్య రోలెక్స్ పాత్ర ద్వారా ట్రెండ్ అవుతున్నారు. ఈ క్రమంలోని సూర్య విరాటపర్వం సినిమా పై స్పందిస్తూ… ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఉందని ఈ సినిమా కోసం తాను ఎదురు చూస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సూర్య చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే ఇందులో సాయి పల్లవి ఉండడంతో సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.