Hero Surya: సూర్య ‘ఈటీ’ ఓటీటీలో విడుదలయ్యేది అప్పుడే…?

Hero Surya: హీరో సూర్య తమిళంతో పాటు తెలుగులోనూ వైవిధ్యభరితమైన కథలతో సినిమాలు చేస్తూ మంచి మార్కెట్‌ ఏర్పర్చుకున్నారనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన ప్రతి సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలవుతుండడం విశేషం. ఇటీవల నటించిన `ఆకాశం నీ హద్దురా`, `జై భీమ్‌` చిత్రాలు ఓటీటీలో విడుదలై భారీ విజయాలను అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో సూర్య తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవల సూర్య నటించిన మరో సినిమా `ఈటీ`.

ఈ మధ్య కాలంలో రిలీజ్‌ అయిన ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నప్పటికీ అంతటి స్థాయిలో హిట్‌ను అందుకోలేకపోయిందనే చెప్పవచ్చు. నాతో ఉండేవాళ్లెప్పుడూ భయపడకూడదు.. మనల్ని ఎవరూ ఏమీ చేయలేరనే లాంటి యాక్షన్ డైలాగ్స్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్యకు ఈ సారి నిరాశే మిగిలినట్టు తెలుస్తోంది. దీనికి కారణం సరైన ప్రమోషన్స్ లేకపోవడం, మరియు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్‌ కూడా రిలీజ్‌ కావడం. సినిమాలో చెప్పుకోదగిన అంశాలు, స్వీక్వెన్స్ చాలానే ఉన్నా సినీ విశ్లేషకులు మాత్రం రొటీన్ స్టోరీ అంటూ పక్కన పెట్టేశారు.

ఇకపోతే ప్రస్తుతం రాధేశ్యామ్‌ లాంటి భారీ సినిమాలు హిట్ అవుతుండడంతో ఈ సినిమాకు ఆదరణ కరువైందనే చెప్పవచ్చు. ఈ చిత్రం రిలీజ్ సమయంలో బుక్‌మై షోలో కనీసం 25% కూడా టికెట్టు బుక్ కాలేదంటే అంతకన్నా చెప్పుకోవాల్సింది ఏముంటుంది అని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడంతా కొత్త సినిమాల మోజులో ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా రుచించకపోవడంతో ఈటీ చిత్రాన్ని ఏప్రిల్ 1న ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కనీసం ఓటీటీలోనైనా మంచి రెస్పాన్స్‌కు నోచుకుంటుందేమో చూడాలి మరి.