యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కు సర్ప్రైజ్ గా వుంధట!!

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’.

కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్ లోరూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రేష్ఠ్ మూవీస్’ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో భారీగా విడుదల చేశారు. జూన్ 3న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ”విక్రమ్ సినిమాని ‘శ్రేష్ఠ్ మూవీస్’ కి ఇచ్చినందుకు చాలా ఆనందంగా వుంది.

నితిన్ గారు, సుధాకర్ రెడ్డి గారి వల్లే విక్రమ్ ప్రేక్షకులకు భారీగా చేరువైయింది. వీరి వలనే చాలా థియేటర్స్ లో విడుదల, భారీగా పబ్లిసిటీ చేయడం జరిగింది. ఈ సినిమాని సుధాకర్ రెడ్డికి ఇస్తూ మా బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నా జాగ్రత్త అని చెప్పా. సుధాకర్ రెడ్డి గారు ఆ బిడ్డని రికార్డ్ బ్రేకింగ్ చైల్డ్ గా చేశారు. లోకేష్ కనగరాజ్ విక్రమ్ ని అద్భుతంగా తీశారు. ఆయన ‘ఖైదీ’ చూసి ఒక అవకాశం ఇచ్చాము.

ఆ అవకాశాన్ని ఆయన అద్భుతంగా చూపించారు. సినిమా గొప్పగా వుంటుందని తెలుసు, ఇంత గొప్పగా వుండటం సర్ప్రైజ్ గా వుంది” అని అంటున్నారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్