ఒకే పదాన్ని వేరువేరు చోట్ల టాటూ వేసుకున్న సురేఖవాణి, సుప్రీత..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో అక్క, వదిన, తల్లి, పిన్ని పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి ప్రస్తుతం సినిమాలలో కన్నా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే తన కూతురు సుప్రీతతో పాటు మరి కొంత మంది కలిసి ఒక టీం గా ఏర్పడిన సురేఖవాణి పెద్ద ఎత్తున తన టీమ్ మెంబర్స్ తో కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు.

ఈ విధంగా వీరందరూ కలిసి తరచూ హాలిడే వెకేషన్ వెళ్లడం పెద్ద ఎత్తున పార్టీలో చేసుకోవడం చేస్తూ, వీరి పార్టీలకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే హోలీ పండుగ సందర్భంగా సురేఖ వాణి టీం కి సంబంధించిన ఒక నటి మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. పబ్బుకు వెళ్లిన ఈమె కొబ్బరి బోండంలో మద్యం కలుపుకొని తాగుతూ వేగంగా కారు నడుపుతూ రోడ్డు ప్రమాదానికి గురైన మృతి చెందారు.

ఇకపోతే సురేఖ వాణి సుప్రీత మృతి చెందిన నటితో పాటు మరికొందరు కలిసి ఒకే పదాన్ని టాటూగా వేరువేరు చోట్ల వేయించుకున్నారు.ఇలా ఒకరి చేతికి టాటూ వేయించుకోగా మరికొందరు కాలికి మరికొందరు కాలి మడమపై కర్మ అనే పదాన్ని టాటూగా వేయించుకున్నారు. ఇలా వీరందరూ కలిసి దిగిన ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది. ఇలా వీరందరూ కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.