అలాంటి అబ్బాయిలు అంటేనే ఇష్టమంటున్న సురేఖవాణి.. రెచ్చిపోయిన ట్రోలర్స్?

సురేఖ వాణి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు సోషల్ మీడియా వార్తలలో నిత్యం ఏదో ఒక విషయం ద్వారా భారీ ఎత్తున ట్రోలింగ్ గురయ్యే సురేఖవాణి తన గురించి వస్తున్న నెగిటివ్ కామెంట్లు ఏమాత్రం పట్టించుకోకుండా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే నిన్న ఈమె పాట పాడుతూ చేసిన ఒక రీల్ వీడియో గురించి పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చాయి. ఈ వయసులో ఇలాంటివన్నీ నీకు అవసరమా అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్ చేశారు. ఇలా ఈ ఘటన మరవక ముందే తాజాగా మరోసారి సురేఖ వాణి సోషల్ మీడియా వేదికగా మరొక వీడియో షేర్ చేశారు.

ఈ వీడియోలో భాగంగా సురేఖ వాణి ఒక డైలాగ్ తనదైన స్టైల్ లో యాక్టింగ్ చేసి చూపించింది. ఒరేయ్ పందీ అమ్మాయిలకు గడ్డం ఉన్న అబ్బాయిలంటేనే ఇష్టం.. అది తీసేస్తానంటావేంట్రా.? అని డైలాగ్ చెప్పారు. ఇంకేముంది ఈ డైలాగ్ పై నెటిజన్లు యధావిధిగా తమ తమ దైన శైలిలో రెచ్చిపోతూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.ఈ క్రమంలోనే కొందరు స్పందిస్తూ ఏంటి సురేఖవాణి ఆంటీకి గడ్డం ఉన్న అబ్బాయిలు అంటేనే ఇష్టమా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది సెలబ్రిటీల నుంచి సాధారణ ప్రజల వరకు ప్రతిరోజు ఎన్నో వీడియో రీల్స్ పెడుతూ ఉన్నారు. ఈ క్రమంలోని సెలబ్రిటీలు పెట్టే రీల్స్ పై నెటిజెన్స్ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నటి సురేఖ వాణి పై నెటిజన్లు ఎప్పటికప్పుడు తన వీడియోలు పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తుంటారు. ప్రస్తుతం సురేఖ వాణి నాలుగు పదుల వయస్సులో ఉన్నప్పటికీ నేటి తరం యువతకు ఏమాత్రం తీసి పోకుండా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు.