Surekha Vaani: వామ్మో పొట్టి గౌనుతో సురేఖ వాణి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా.. వీడియో వైరల్!

Surekha Vaani: ఎన్నో తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా సమయంలో ఈమె సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా తన కూతురు సుప్రీతను కూడా పరిచయం చేసింది.ఇలా నిత్యం సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ దుస్తులను ధరించి ఎన్నో రకాల వీడియోలను చేస్తూ వాటిని అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే ఈ వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ గా మారడంతో ఏకంగా హీరోయిన్స్ కి ఉన్నటువంటి క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇకపోతే కొత్త సంవత్సరం వస్తున్న నేపథ్యంలో నటి సురేఖ వాణి తన కూతురుతో కలిసి న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఎంతో వేడుకగా జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని శుక్రవారం రాత్రి పొట్టి గౌను ధరించి తన కూతురుతో కలిసి ఓ పాటకు చిందులు వేసింది. ఈ క్రమంలోనే ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజెన్స్ స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు స్పందిస్తూ మీ కూతురి కన్న మీరే అందంగా ఉన్నారు. అదేవిధంగా ఎంతో హాట్ గా ఉన్నారంటూ కామెంట్లు చేయగా మరికొందరు, మీ కూతురుకి తల్లిలా కాకుండా అక్కలా ఉన్నారు అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.అయితే ఈ వీడియోపై కొందరు స్పందిస్తూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు సరే మరి ఇలాంటి డ్రెస్ లో జరుపుకోవడం ఏంటి అంటూ వీరి వస్త్రధారణ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సురేఖవాణి తాజాగా ట్విట్టర్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.