పాట పాడుతూ సందడి చేసిన సురేఖ వాణి.. ఈ వయసులో మీకు అవసరమా అంటూ ట్రోల్..!

ఎన్నో సంవత్సరాలుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సురేఖ వాణి కూడా ఒకరు. అక్క, అమ్మ, వదిన వంటి పాత్రలలో నటించి ఇంట్లో మనిషిగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది సినిమాలలో చీరకట్టులో ఎంతో పద్ధతిగా కనిపించే సురేఖ వాణి బయట మాత్రం కొంచెం స్టైలిష్ గా కనిపిస్తుంది సురేఖ వాణి ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాలలో నటించడం లేదు. అయినప్పటికీ ఈమె ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది అందుకు కారణం సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సురేఖ వాణి తన కూతురితో కలిసి ఉన్న వీడియోలు ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ ఫోటోలు వీడియోల ద్వారా సురేఖవాణి తన కూతురితో పోటీపడుతూ అందాలు ఆరబోస్తుంది ఈ కారణం వల్ల ఈమె తరచూ వార్తల్లో నిలుస్తోంది. 40 సంవత్సరాల వయసు దాటినా కూడా కూతురికి ఏమాత్రం తీసిపోకుండా అందాన్ని మెయింటైన్ చేస్తూ కూతురితో కలిసి రచ్చ చేస్తోంది. ఇన్ స్టా వేదికగా ఈమె షేర్ చేసే వీడియోలు చూసిన నెటిజన్లు ఈమె మీద విమర్శలు చేస్తున్నారు.

ఇటీవల కూతురితో కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. తాజాగా ఈమె షేర్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో సురేఖ వాణి అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు సినిమాలోని “తెలుసా తెలుసా” అనే పాటకి లిప్ మూమెంట్ ఇస్తూ ఉయ్యాల ఊగుతూ ఎంజాయ్ చేస్తోంది. ఈ వీడియో చుసిన నెటిజన్లు ఈ వయసులో మీకు ఈ పాట అవసరమా ఆంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీ కూతురికి పెళ్ళయ్యేదాక ఐనా కొంచం ఇవన్నీ ఆపండి లేకపోతే మీ కూతురికి బదులు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.