హేయ్ బి**అంటూ రెచ్చిపోయి పోస్ట్ చేసిన సురేఖ వాణి కూతురు సుప్రీత!

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తల్లితో కలిసి నిత్యం డాన్స్ రీల్స్ చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు.ఇక వీళ్ళిద్దరూ తల్లి కూతుర్లు అనే తేడా లేకుండా స్నేహితులుగా పొట్టి దుస్తులు ధరిస్తూ ఫోటోషూట్లు చేయడం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ఇకపోతే సుప్రీత వ్యవహార శైలి గురించి నిత్యం నేటిజెన్లు ఎన్నో రకాలుగా ఈమె గురించి కామెంట్లు చేసిన వాటి గురించి పెద్దగా పట్టించుకోదు.

సుప్రీత సోషల్ మీడియా వేదికగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా అభిమానులను సందడి చేయడం కోసం నిత్యం తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను, వీకెండ్ పార్టీలు అంటూ పెద్ద ఎత్తున రచ్చ చేయడమే కాకుండా వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించే ఈమెకు తరచూ తన ప్రేమ గురించి పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి.

ఇకపోతే తాజాగా సుప్రీత ఫ్రెండ్ సోషల్ మీడియా వేదికగా హాయ్ సుప్రీత అంటూ పోస్ట్ పెట్టెగా సుప్రీత ఆ పోస్టుకు స్పందిస్తూ ఏకంగా హేయ్ బి** అంటూ పోస్ట్ చేసింది. ఈ విధంగా సుప్రీత చేసిన పోస్ట్ చూసి ఒక్కసారిగా అభిమానులు నేటిజన్ లు ఆశ్చర్యపోయారు. అయితే సుప్రీత ఇలా ఎందుకు పోస్ట్ పెట్టిందో తెలియదు కానీ ఈమె చేస్తున్న ఈ పోస్ట్ మాత్రం వైరల్ అవుతుంది. ఇకపోతే సుప్రీత మంచు లక్ష్మితో కలిసి లేచింది మహిళా లోకం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.