Supritha: తెలుగు సినీ ప్రేక్షకులకు నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది సురేఖవాణి. ఇక సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలసి ఎన్నో టిక్ టాక్ వీడియోలు తీశారు. ఇక సురేఖ వాణి ఈ వయసులో కూడా తన కూతురు తో కలిసి స్టెప్పులు వేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇకపోతే సురేఖావాణి కూతురు సుప్రీత విషయానికి వస్తే.. ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఒక నెటిజన్ నందు అనే అబ్బాయి మీకు బెస్ట్ ఫ్రెండ్ నా లేక బాయ్ ఫ్రెండ్ నా అని ప్రశ్నించగా..
అవును ప్రతి అమ్మాయికి అలాంటి స్నేహితుడు ఒకడు ఉండాలి.. ఒక అబ్బాయి ఒక అమ్మాయి స్నేహితుడిగా ఉండలేరు అని అందరూ అనుకుంటూ ఉంటారు.. కానీ మేము మాత్రం మంచి స్నేహితులుగా ఉంన్నాం.. ఎవరు ఏమనుకున్నా సరే ఎప్పటికీ మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ సుప్రీత తన బెస్ట్ ఫ్రెండ్ అయినా నందు గురించి తాజాగా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా సుప్రీత మరొక యువకుడితో క్లోజ్ గా ఉన్న ఫోటోని షేర్ చేసి.. అవును ఎస్ చెప్పేసా అంటూ లవ్ సింబల్ ని జత చేస్తూ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీంతో సుప్రీత ఆ వ్యక్తితో ప్రేమలో ఉంది అని, అంతేకాకుండా త్వరలోనే సురేఖవాణి ఇంటికి అల్లుడు రాబోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే రానా దగ్గుబాటి తన భార్య మిహికా ను సడన్ గా అభిమానులకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇక సుప్రీతా కూడా రానా బాటలో ప్రయాణిస్తోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. సుప్రీత పోస్ట్ చేసిన ఫోటోలో ఉన్న యువకుడి పేరు రాకీ జోర్డాన్. ఇక అతను కూడా సుప్రీత ఎస్ చెప్పింది అంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా తెలిపాడు. మరి వీరిద్దరి నిజమైన ప్రేమనా? లేకపోతే ఏదైనా వీడియో ప్రమోషన్స్ కోసం ఇలా చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విషయంపై సురేఖవాణి రియాక్ట్ అయ్యేవరకు ఏ విషయం అన్నది తెలియదు.