Balakrishna:నాటకాల్లో లేదా సినిమాల్లో పౌరాణిక పాత్రలు నటించే కిరీటాలు చాలా బరువుగా ఉంటాయని సురభి జయానంద్ చెప్పారు. మామూలుగా అవి కొంచెం సేపు పెట్టుకుంటేనే చాలా ఇబ్బందిగా ఫీలవుతారని ఆయన అన్నారు. తాము కూడా నాటకాలు వేసేటపుడు, అలాంటి పాత్రలు వేసేటపుడు అప్పుడపుడు ఆ కిరీటాలను తీసి పెడుతుంటామని ఆయన తెలిపారు.
కానీ బాలకృష్ణ గారు మాత్రం ఉదయం 5గంటలకు వచ్చి, దాదాపు 6కిలోలున్న ఆ కిరీటం పెట్టుకొని దుర్యోధనుని గెటప్ వేసుకొని అలాగే ఉంటారని జయానంద్ అన్నారు. అంతే కాకుండా ఆ గెటప్ బరువు కూడా చాలా ఉంటుందని, అవన్నీ మోస్తూ స్టెప్స్ పై నుంచి నడుచుకుంటూ వచ్చే సీన్ ఒకటుంటుందని ఆయన చెప్పారు. కనీసం బ్రేక్ టైంలో కూడా తీయకుండా అలాగే ఉంచుకుంటారని ఆయన చెప్పారు.
ఇకపోతే బాలకృష్ణ గారు ఒక్కసారి క్యారవాన్ నుంచి దిగి స్టూడియోలోకి వచ్చారంటే, మళ్లీ క్యారవాన్‌లోకి వెళ్లరని జయానంద్ తెలిపారు. ఆ మధ్య గ్యాప్‌లోనే తమతో మాట్లాడుతూ, తిన్నారా లేదా అని అన్నీ తెలుసుకుంటారని ఆయన చెప్పారు. అలాంటి గొప్ప వ్యక్తి ముందు తాను కృష్ణుని గెటప్ వేయాలంటే కాస్త భయం కలిగిందని ఆయన చెప్పారు. అందరూ దూరంగా ఆయన్ని చూసి భయపడుతూ ఉంటారని, కానీ ఆయన్ని దగ్గర్నుంచి చూస్తేనే ఆయన మనస్తత్వం తెలుస్తుందని ఆయన తెలిపారు. తన శ్రీ కృష్ణుని ప్రోమో చూసి బాలకృష్ణ గారు బాగుందయ్యా అని చెప్పడంతో తాను సంతోషంగా ఫీలయ్యానని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.