పెళ్లి గురించి అడిగిన నెటిజన్… దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన సుప్రీత ?

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్క చెల్లి అమ్మ వదిన పాత్రలలో ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపించే సురేఖ వాణి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అయితే చాలా కాలంగా ఈవిడ తెలుగు సినిమాలలో ఎక్కువగా కనిపించటం లేదు. అయినప్పటి సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు ఎప్పుడు టచ్ లో ఉంటుంది. అయితే సురేఖ వాణి సోషల్ మీడియాలో తన కూతురితో కలసి సందడి చేస్తూ ఉంటుంది. ఈ వయసులో కూడా సురేఖ వాణి తన కుతురికి పోటీగా పొట్టి బట్టలు వేసుకొని డాన్స్ చేస్తూ ఉంటుంది.

సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా అందరికి సుపరిచితమే. తన తల్లితో కలిసి అందమైన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో ఈ అమ్మడికి భారీ ఫాలోయింగ్ ఉంది. సుప్రీత తన తల్లి , ఫ్రెండ్స్ తో కలిసి పబ్బులు పార్టీలు అంటూ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ సందడి చేస్తోంది. అయితే కొన్ని సందర్భాలలో వీరు నెటిజన్స్ నుండి విమర్శలు కూడ ఎదుర్కొంటున్నారు. తన గురించి, తన తల్లి గురించి తప్పుగా మాట్లాడితే సుప్రీత వెంటనే రియర్ట్ అయ్యి వారి మీద విరుచుకుపడుతుంది. అయితే సుప్రీత ప్రేమ, పెళ్లి గురించి కూడా సోషల్ మీడియాలో చాలా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఈ అమ్మడు ఒక యువకుడితో ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపించాయి.

కానీ ఆ వార్తలలో నిజం లేదని సుప్రీత క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండగా మరొకరి ఈ అమ్మడి ప్రేమ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అప్పుడప్పుడు తన అభిమానులతో చిట్ చాట్ చేసే సుప్రీత తాజగా కూడా వారితో చిట్ చాట్ చేసింది. తనకి నిద్ర పట్టలేదని క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టింది. ఈ క్రమంలో ఒక నెటిజన్ ప్రేమలో పడిన వారికి తిండి, నిద్ర అసలు ఉండవు అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు. ఈ విషయంపై స్పందించిన సుప్రీత.. భయ్యా ఈ లవ్వు..జివ్వు మనకెందుకు చెప్పు. నేను బాగా తిని, ఫుల్లుగా నిద్రపోతా అంటూ తను ప్రేమలో లేనని పరోక్షంగా అదిరిపోయే సమధానం ఇచ్చింది. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.