సుప్రీం కోర్టు జగన్‌కు షాక్ ఇచ్చిన రోజే మోడీకీ ఇచ్చింది అంతకంటే పెద్ద షాక్

సుప్రీం కోర్టు జగన్‌కు షాక్ ఇచ్చిన రోజే మోడీకీ ఇచ్చింది అంతకంటే పెద్ద షాక్
నిన్న సుప్రీం కోర్టు ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చింది.  ఏపీ హైకోర్టు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులపై స్టేటస్ కో విధించింది.  దీంతో ప్రభుత్వం విశాఖకు పాలనా పరమైన శాఖలను తరలించడానికి వీలు లేకుండా పోయింది.  దీంతో స్టేటస్ కో మీద స్టే ఇవ్వాలని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది.  నిన్న ఈ పిటిషన్ విచారణకు వచ్చింది.  కానీ సుప్రీం కోర్టు మాత్రం స్టేటస్ కో మీద స్టే ఇవ్వడం కుదరదని, కేసు హైకోర్టులో విచారణ దశలో ఉండగా తాము జోక్యం చేసుకోలేమని తేల్చింది.  దీంతో ఏదో ఆశించిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.  మరోవైపు కేంద్రంలో ఉన్న మోడీ సర్కారుకు ఇంతకంటే పెద్ద షాకే ఇచ్చింది సుప్రీం కోర్టు. 
సుప్రీం కోర్టు జగన్‌కు షాక్ ఇచ్చిన రోజే మోడీకీ ఇచ్చింది అంతకంటే పెద్ద షాక్
సుప్రీం కోర్టు జగన్‌కు షాక్ ఇచ్చిన రోజే మోడీకీ ఇచ్చింది అంతకంటే పెద్ద షాక్
 
కరోనా లాక్ డౌన్ కారణంగా ఆదాయాలు తగ్గడంతో కస్టమర్లకు ఉపశమనం కలిగించడానికి ఆర్బీఐ మారటోరియం సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే.  కానీ రుణాలపై వడ్డీలు, ఆ వడ్డీలపై వడ్డీలు వసూలు చెల్లించాలనేసరికి చెల్లింపుదారులకు కలిగే ప్రయోజనం శూన్యమైంది. చెల్లింపుదారుల‌కు మార్చి నుంచి ఆగ‌స్టు వ‌రకు రెండు విడ‌త‌లుగా రుణ మార‌టోరియం తీసుకునే వసతి ఉండింది.   ఆ గడువు ఈ నెల 31తో ముగియనుంది.  వచ్చే నెల నుండి యథావిధిగా వాయిదాలు చెల్లించాలి.  ఈ విషయమై ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  
 
దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం విపత్తు నిర్వహణ చట్టం కింద కేంద్రానికి అనేక అధికారాలు ఉన్నప్పటికీ ఆర్బీఐను చూపి తప్పించుకునేందుకు చూస్తోందని వ్యాపార ధోరణితోనే కాదని ప్రజల ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని తెలిపింది.  కేంద్రం లాక్‌డౌన్‌ విధించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని దీనిపై కేంద్రమే ఓ నిర్ణయం తీసుకోవాలని తెలిపింది సుప్రీం కోర్టు ఆదేశించింది.  వివరణ ఇవ్వడానికి కేంద్రం వారం గడువు కోరగా ధర్మాసనం అంగీకరించి సెప్టెంబర్ 1నాటికి స్పందన తెలపాలని ఆదేశించింది.  అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో బ్యాంకులకు నష్టం వాటిల్లుతుందని వాదించిన కేంద్ర ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలినట్టుంది.