తెలంగాణా కాగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ, ఫైర్ బ్రాండ్ రేవoత్ రెడ్డి పేరెత్తితే! టీఆర్ ఎస్ పార్టీ…ఆ పార్టీకి చెందిన మంత్రులు ఏ స్థాయిలో మండిపడతారో? చెప్పాల్సిన పనిలేదు. అలాగే టీఆర్ ఎస్ అంటే ఒంటికాలుపై లేచి పడి కేసీఆర్ ని టార్గెట్ చేసి విమర్శలు చేయడం అన్నది రేవంత్ రెడ్డి కే చెల్లింది. టీఆర్ ఎస్ అంతా కలిసొచ్చినా రేవంత్ రెడ్డి ఒన్ మ్యాన్ ఆర్మీలా దాడి చేయగల నాయకుడు. అందుకే కాంగ్రెస్ అదిష్టానం పీసీసీ పట్టాన్ని ఫైర్ బ్రాండ్ కి కట్టబెట్టాలని యోచిస్తోంది. కేసీఆర్ అండ్ కో పై సరైన కౌంటర్లు వేయడం..తూటాల్లాంటి మాటలు వదలడం..సమస్య పై స్పందించడం వంటి విషయాల్లో రెవంత్ రెడ్డి కొట్టిన పిండి లాంటి వారు.
మరి ఇలాంటి నాయకుడ్ని కేసీఆర్ నమ్ముకున్న నేతే ప్రశంశిస్తే ఎలా ఉంటుంది. కేసీఆర్ కి ఇంకెక్కడో కాలదా? రేవంత్ రెడ్డిని ఇంకెక్కడా టచ్ చేయడా? సరిగ్గా అదే జరిగింది. టీఆర్ఎస్ నేత,శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ రెవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. బోయిన పల్లిలోని సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఇరువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెవంత్ రెడ్డి అగ్ర కులంలో పుట్టిన బడుగు, బలహీన వర్గాల నాయకుడిగా కీర్తించారు. అలాంటి నాయకుడికి మనమంతా కూడా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో డబ్బులున్న వారికే పార్టీలు టిక్కెట్లు ఇస్తున్నాయని, ఇలాంటి వాటిని సమూలంగా నాశనం చేయాలంటే యువత రాజకీయాల్లోకి రావాలన్నారు.
రాష్ర్టంలో రాజకీయాలు మారాలని..అప్పుడే ప్రజాస్వామ్యంలో కూడా మార్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు. మరి ఈ వ్యాఖ్యలు కేసీఆర్ కు ఆగ్రహాన్ని తెప్పించవంటారా? ఆయన పార్టీ నేత ఇలా బహిరంగంగా కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి రాజకీయ శత్రువైన రేవంత్ ని ఆకాశానికి ఎత్తేస్తే పెద్దాయనకు చిర్రెత్తుకురాదా? మరి స్వామిగౌడ్ వ్యాఖ్యలపై టీఆర్ ఎస్ అండ్ కో ఎలా స్పందిస్తుందో చూద్దాం.