‘జిన్నా’ ఫస్ట్ లుక్ లో సన్నీ లియోన్ పోస్ట‌ర్..

బాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ తెలుగులో పూర్తి స్థాయిలో న‌టిస్తున్న తాజా చిత్రం జిన్నా. ఈ చిత్రయూనిట్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో సన్నీ లియోన్ పాత్ర ఏమిటి, ఆమె ఎలా నటిస్తుందో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంద‌ర్భంలో కొత్త లుక్ సోషల్ మీడియాలో విప‌రీత‌మైన‌ బజ్ క్రియేట్ చేస్తోంది.

ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను రచయిత అయిన‌ కోన వెంకట్ అందించారు.

ఈ చిత్రంలో హీరో మంచు విష్ణు స‌ర‌స‌న‌ సన్నీలియోన్, తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలైన‌ మరో డైన‌మిక్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.

తెలుగు తమిళం, మలయాళం, హిందీ అనే నాలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న జిన్నా రోజురోజుకు మంచి బజ్‌ని సోంతం చేసుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో విష్ణుతో స‌న్నీ రీల్స్, విష్ణు, ఆయ‌న బృందంతో సన్నీ ఓ చమత్కారమైన రీల్స్ విడుద‌ల చేసి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించారు. ‘నాటు నాటు’ ఫేమ్ ప్రేమ్ రక్షిత్ మాస్ట‌ర్ ఈ చిత్రానికి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా ప‌ని చేస్తున్నట్లు సమాచారం. త‌న సంగీతంతో తెలుగు ప్రేక్ష‌కుల‌నీ ఉర్రుత‌లూగించే అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు.