Singer Sunitha: నోటి దూల నీది, నీ భారం భూమిది అంటూ స్ట్రాంగ్ వార్నిగ్ ఇచ్చిన సునీత..?

Singer Sunitha: సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తరువాత అభిమానులకు సెలబ్రిటీలకు మధ్య వ్యత్యాసం తగ్గింది. సోషల్ మీడియా వాడకం రోజు రోజుకీ పెరిగిపోవడంతో నెటిజన్స్ సెలబ్రిటీలకు మరింత చేరువ అవుతున్నారు. అయితే దీనిని కొంతమంది నెటిజన్స్ ఆసరాగా తీసుకొని పలువురు సెలబ్రిటీల పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్కువగా సెలబ్రిటీలను పొగడటం కన్నా ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే సెలబ్రిటీ లో ఫోటోలు వీడియోలు షేర్ చేసినప్పుడు వాటిపై వెంటనే సెటైర్లు వేయడానికి కొందరు నెటిజన్లు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు.

ఈ నేపథ్యంలోనే కొందరు సెలబ్రెటీలు వారిపై వస్తున్న కామెంట్లను చూసి చూడకుండా వదిలేస్తూ ఉంటారు. ఇంకొందరు అయితే అలా వారిపై కామెంట్లు చేసే వారికి స్ట్రాంగ్ గా వార్నింగ్ లు ఇస్తుంటారు. తాజాగా సింగర్ సునీత కూడా నెటిజెన్స్ పై తీవ్రస్థాయిలో మండిపడింది. తన భర్త రామ్ వీరపనేని విషయంలో కామెంట్స్ చేసిన వారి పై ఆమె మండిపడింది. తాజాగా సునీత, ఆమె భర్త రామ్ వీరపనేని దంపతులు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలోని ఆలయానికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆ ఆలయంలో ఒక విగ్రహం ముందు దిగిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దీనిపై ఒక నెటిజెన్ కామెంట్ చేస్తూ కాకి ముక్కుకు దొండ పండు.. సునీతకు ముసలి రామ్ మొగుడు.. అందం ఈమె సొంతం.. ధనము ఆయన సొంతం.. గానం ఈవిడది.. దర్జా అతనిది అంటూ హద్దు మీరి మరి కామెంట్స్ చేశాడు. ఈ విషయంపై కాస్త ఘాటుగా స్పందించిన సునీత నోటి దూల నీది.. నీ భారం భూమి అంటూ ఆమె తన స్టైల్లో కౌంటర్ ఇచ్చింది. ఇక సునీత చేసిన పనికి నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటున్నారు. అతనికి తగిన గుణపాఠం చెప్పారు అంటూ ఆమెపై పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. దీంతో సునీత ఎమోషనల్‌ అవుతూ నాపై మీకున్న గౌరవానికి, అభిమానానికి నేనెప్పటికీ రుణపడి ఉంటాను. అనుకోకుండా ఇలాంటి ఒక కామెంట్‌ ద్వారా నాకోసం నిలబడే నా శ్రేయోభిలాషులు ఇంతమంది ఉన్నారని తెలుసుకుని గర్వపడుతున్నాను. ఎన్నో చూశాను, చూస్తూనే ఉన్నాను. అయినా ఎప్పుడూ ఎవరినీ ద్వేషించే గుణం రాలేదు. ఇక్కడితో వదిలేద్దాం.. సంకుచిత భావాలతో బతికేవారిని ఆ దేవుడు కాపాడుగాక అని కామెంట్‌ చేసింది.