బట్టలు కొనడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడిన బాలీవుడ్ హీరో… ఎవరంటే?

బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతూ ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ వరుస సినిమాలు అలాగే వరుస బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎంతో బిజీగా గడుపుతున్నారు నటుడు సల్మాన్ ఖాన్. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇకపోతే ఈయన గత కొంత కాలం నుంచి బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా బుల్లితెర వెండితెరపై సల్మాన్ ఖాన్ ఏడాదికి కొన్ని కోట్లలో సంపాదిస్తున్నారని తెలుస్తోంది.

తాజాగా సల్మాన్ ఖాన్ జూన్‌ 3, 4 తేదీల్లో దుబాయ్‌లో జరిగిన ‘ఐఫా’ అవార్డుల ప్రదానోత్సవానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ ఒకింత ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ తనకు ఇండస్ట్రీలో సునీల్ శెట్టి అన్నయ్య లాంటివాడని తనతో ఉన్న అనుబంధం గురించి ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ బయటపెట్టారు.

తాను అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న సమయంలో సునీల్ శెట్టితో కలిసి బట్టలు కొనడానికి దుకాణానికి వెళ్లామని తెలిపారు. అయితే అక్కడ తనకు అప్పుడే మార్కెట్‌లోకి వచ్చిన ట్రెండీ జీన్స్‌, షర్ట్‌, బూట్లు, పర్స్ ఉన్న ఓ సెట్‌ నాకెంతో నచ్చింది.అయితే ఆ సెట్ కొనడానికి సరిపడా డబ్బులు నా దగ్గర లేకపోవడంతో ఎంతో బాధగా వెనుతిరిగి వచ్చాను. ఆ సమయంలో నేను పడిన బాధను గుర్తించిన సునీల్ శెట్టి నాకు ఆ సెట్ కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చారని, ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ గతంలో జరిగిన ఈ సంఘటన గురించి ఈ సందర్భంగా తెలియజేశారు.