మండుతున్న ఎండలు.. బయటకు రావద్దని అధికారులహెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మార్చి లోనే ఇలా ఉంటే.. ముందు రోజుల్లో ఇంకెంత దారుణ పరిస్థితులు ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలో తాజగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తగ్గడంతో వేడి పెరిగింది. మధ్యాహ్నం ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది. రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతున్నాయి. వడగాలులు ప్రభావం ఉంటుంది కావునా… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.