Sumanth -Jr NTR: అతని బ్లడ్ లోనే యాక్టింగ్ ఉంది.. ఎన్టీఆర్ గురించి సుమంత్ కామెంట్స్!

Sumanth -Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.ఈ క్రమంలోనే ఎంతో మంది డైరెక్టర్లు అతని నటన ప్రశంశలు కురిపించారు. ఇక ఎన్టీఆర్ నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తారక్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని దర్శకుడు అతనీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తారక్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నటించిన RRR సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఏ రాష్ట్రానికి వెళ్లిన ఆ భాష మాట్లాడుతూ తనలో ఉన్న నైపుణ్యాన్ని బయటపెట్టారు.

ఈ విధంగా అన్ని భాషల గురించి అనర్గళంగా మాట్లాడటం అంత సులువైన పని కాదు. అది కేవలం తారక్ వల్ల మాత్రమే సాధ్యం అవుతుందని సుమంత్ ఎన్టీఆర్ గురించి తెలియజేశారు. తాజాగా సుమంత్ నటించిన మళ్ళీ మొదలైంది సినిమా ఓటిటిలో రిలీజ్ అయ్యింది. దీని ప్రమోషన్ లలో భాగంగా సుమంత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆయనకు ఎన్టీఆర్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ సందర్భంగా తారక్ గురించి మాట్లాడిన సుమంత్
నా దృష్టిలో అతను ప్యూర్ యాక్టర్ అలాగే బెస్ట్ యాక్టర్. ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో ఎన్టీఆర్ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలడు ఎన్టీఆర్ బ్లడ్ లోనే నటన దాగి ఉంది ఆయనలో తాతగారు పోలికలు అణువణువు ఉన్నాయని సుమంత్ ఎన్టీఆర్ గురించి తెలియజేశారు. ఇక ఈయన నటించిన RRR సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కొరటాల సినిమాలో ఎన్టీఆర్ బిజీగా కానున్నారు.