బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో కార్యక్రమాలకు అలాగే సినిమా ఈవెంట్లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు ఎంతో బిజీగా ఉన్న ఈమె తాజాగా జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా వెండితెర పైకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు సుమ పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సుమ తన స్నేహితురాలు సింగర్ సునీతతో కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా సునీత అడిగే ప్రశ్నలకు సుమ సమాధానం చెబుతూ ప్రేక్షకులను సందడి చేశారు. అయితే సునీత సుమను ప్రశ్నిస్తూ తనని పూర్తిగా ఇరకాటంలోకి పడేసారు. ఈ క్రమంలోనే సునీత అడిగిన ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక సుమ కాస్త కంగారు పడ్డారు. ఇంతకీ సునీత ఎలాంటి ప్రశ్న అడిగారు అసలేం జరిగింది అనే విషయానికి వస్తే…
జయమ్మ పంచాయతీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సునీత సుమను ప్రశ్నిస్తూ… నీకు ఒకేసారి పవన్ కళ్యాణ్ సినిమాలోని అలాగే మీ ఆయన రాజీవ్ కనకాల సినిమాలో నటించే అవకాశం వస్తే నువ్వు ఎవరి సినిమాలో చేస్తావు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్న విన్న సుమ చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్ వేశావు అంటూ సమాధానం చెప్పారు. ఈ ప్రశ్నకు సుమ ఎంతో చాకచక్యంగా సమాధానం చెప్పింది. ఈ సందర్భంగా ఈమె సమాధానం చెబుతూ రాజా నీ నిజ జీవితంలో నేనే నీ హీరోయిన్.. కనుక ఈసారికి పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాను అంటూ ఎంతో తెలివిగా సమాధానం చెప్పారు. సుమ ఈ విధంగా సమాధానం చెప్పడంతో నెటిజన్లు ఎంతైనా సుమక్క కదా అంటూ కామెంట్ చేస్తున్నారు.