Anchor Suma: క్యాష్ షో లో దేవి నాగవల్లిని ఇమిటేట్ చేసిన సుమ..!

Anchor Suma: ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ప్రసారమవుతున్న ఈ షో ఇంత సక్సెస్ సాధించడానికి సుమ యాంకరింగ్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఈ షోలో ఎంతోమంది సెలబ్రిటీలు పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తుంటారు. ఇక ఈ షోలో సుమ చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ షో కి వచ్చిన గెస్ట్ లతో ఫన్నీ టాస్క్ లు ఆడించి వారి మీద సెటైర్ లు వేస్తూ ఫుల్ ఫన్ క్రియేట్ చేస్తుంది.

ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో భాగంగా “డేగల బాబ్జి” సినిమా టీమ్ సందడి చేసింది. ఈ సందర్భంగా బండ్ల గణేష్, సమీర్, జోష్ రవి, సినిమా డైరెక్టర్ పాల్గొన్నారు. ఈ షో లో బండ్ల గణేష్ సుమ మీద పంచ్ లు వేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేశాడు. ఇక ఈ షో లో సుమ ఒక గేమ్ లో భాగంగా సమీర్ మీద సీరియస్ అవుతా దేవి నాగవల్లిల మాట్లాడుతూ గేట్ ఔట్ ఫ్రమ్ మై స్టూడియో అంటూ నాగవల్లిని ఇమిటేట్ చేసింది.

దేవి నాగవల్లి టీవీ9 లో న్యూస్ ప్రజెంట్ గా అందరికీ సుపరిచితమే. ఈమె ఇప్పటికే ఎన్నోసార్లు తన నోటి దురుసు కారణంగా విభాగాల్లో నిలిచింది. ఇటీవల కూడా హీరో విశ్వక్సేన్ తో గొడవ కారణంగా వార్తల్లో నిలిచింది. ఈ గొడవ కారణంగా నెటిజన్స్ ఈమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్య దేవి నాగవల్లిని అందరు ఇమిటేట్ చేస్తున్నారు. ఇటీవల జబర్దస్త్ లో పొట్టి నరేష్ దేవినగవల్లిలా డైలాగులు చెప్పాడు. ఇక ఇప్పుడు క్యాష్ షో లో సుమ కూడా నాగవల్లి లాగా గేట్ ఔట్ ఫ్రమ్ మై స్టూడియో అంటూ డైలాగ్ చెప్పి ఆమెను ఇమిటేట్ చేసింది.