Suma Kanakala: తన మొహం చూసుకోవటానికి టైమ్ లేదంటున్న సుమ… సుమ రేంజ్ మామూలుగా లేదుగా!

Suma Kanakala: యాంకర్ సుమ ఎల్లప్పుడూ ఏదో ఒక చోట దర్శనమిస్తూనే ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లు, టీవీ షోస్, యాక్టింగ్ అంటూ తినటానికి కూడా సమయం దొరకక ఎల్లప్పుడూ బిజీగా ఉంటుంది. సుమ డేట్స్ కోసం పెద్ద పెద్ద హీరోలు ఎదురుచూస్తూ ఉంటారు. తెలుగు ఇండస్ట్రీలో ఆమె రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతటి గొప్ప హీరో అయిన సుమ లేనిదే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగదు. ప్రతిరోజు బిజీ గా ఉండే సుమ ఏ సందర్భంలో కూడా చిరాకుగా కనిపించదు. ఎప్పుడు నవ్వుతూ ,అందరినీ నవ్విస్తూ ఉంటుంది.

ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రాం కి గత కొన్ని సంవత్సరాలుగా సుమ యాంకరింగ్ చేస్తోంది. తాజాగా ఈ షోకు లూసర్ సీజన్ 2 టీం గెస్ట్ గా వచ్చారు. ఇటీవల ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో సుమ సరదాగానే నవ్వుతూ తన గురించిన ఒక నిజాన్ని ఒప్పుకుంది.
ప్రోమో లో సుమ లూజర్ సీజన్ 2 బాగా హిట్ అయిందని విన్నాను అని అనగా.. అందుకు ప్రియదర్శి స్పందిస్తూ అదేంటి విన్నారా? మీరు చూడలేదా? అని అడగగా.. దానికి సుమ మాట్లాడుతూ ఒక్కోసారి నా మొహం నేను చూసుకోవడానికి కూడా పది రోజుల సమయం పడుతుందని తనమీద తానే కౌంటర్ వేసుకుంది.

టీవీ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లు, ఇంటర్వ్యూస్, యూట్యూబ్ ఛానల్ అంటూ ప్రతిక్షణం బిజీగా ఉండే సుమ తాజాగా యాక్టింగ్ కూడా మొదలు పెట్టింది. తాజాగా సుమ జయమ్మ పంచాయితీ అను లీడ్ రోల్ లో నటిస్తుంది. ఇన్ని పనులతో ప్రతిక్షణం బిజీగా ఉండే సుమ తీరికగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడటానికి సమయం ఎక్కడ ఉంటుంది.