Anchor Suma: క్యాష్ ప్రోగ్రామ్ లో నాగార్జున సినిమాని ఆడేసుకున్న సుమ..!

Anchor Suma: టాలీవుడ్లోని ఫిమేల్ యాంకర్స్ లో సుమ కనకాల మొదటి స్థానంలో ఉంటుంది. ఎంతోమంది ఫిమేల్ యాంకర్స్ ఉన్నప్పటికీ ఈమెకు ఎవరు సాటిరారు. పెద్ద పెద్ద హీరోలు సైతం వివిధ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారంటేనే ఈవిడ క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతుంది. అనేక టీవీ షో లు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లతో సుమ నిత్యం బిజీగా ఉంటుంది. ఇలా యాంకరింగ్ మాత్రమే కాకుండా తన నటనతో కూడా అందరిని అలరిస్తోంది. ఇప్పుడు జయమ్మ పంచాయితీ అనే సినిమాలో కూడా సుమ నటిస్తోంది.

ఈ టీవీలో స్టార్ మహిళ,క్యాష్ ప్రోగ్రాంలు ఎన్నో సంవత్సరాలుగా ప్రసమవుతునే ఉన్నాయి. క్యాష్ ప్రోగ్రామ్ లో సుమ చేసే సందడి అంతా ఇంతా కాదు. ప్రోగ్రాం కి వచ్చిన వారితో సుమ ఒక ఆట ఆడుకుంటుంది. ఈ క్రమంలో క్యాష్ ప్రోగ్రామ్ కి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. తాజా గా డీజే టిల్లు, సిద్దు జొన్నలగడ్డ, మరొక యంగ్ హీరో ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమ డీజే టిల్లు నీ బంగార్రాజు సినిమాకి సంబంధించిన ఒక ఫోటో క్లిప్ చూపించి స్టోరీ అడగగా అతను చెప్పలేక పోయాడు.

తర్వాత అక్కడ ఉన్న ఇద్దరు హీరోలని అడగగా వారికి తోచినది చెప్పారు. అప్పుడు సుమ ఇద్దరు సినిమా చూడలేదని అర్థమయ్యింది అంది. పక్క హీరోల సినిమాలను కూడా అప్పుడప్పుడు చూడాలని సెటైర్ వేసింది. అప్పుడు అక్కడున్న హీరోలు మీరు చెప్పండి అని సుమ నీ అడగగా ఆమె కూడా ఏదేదో చెప్పటంతో సుమ కూడా సినిమా చూడలేదని అందరికీ అర్థమైంది.మొత్తానికి అందరూ ఇలా క్యాష్ ప్రోగ్రాంలో బంగార్రాజు సినిమాని అదేసుకున్నారు. ఐతే ఇదంతా సరదాకోసం చేయటంతో అందరూ నవ్వుకున్నారు.