సుకుమార్ అస్సలు టైమ్ వేస్ట్ చెయ్యట్లేదు

Sukumar working on Vijay Devarakonda project
Sukumar working on Vijay Devarakonda project
 
లాక్ డౌన్ దెబ్బకు సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. హీరోలతో పాటు దర్శకులు కూడ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ ఖాళీ టైంలో కొందరు దర్శకులు కొత్త ప్రాజెక్ట్స్ పనులు మొదలుపెట్టారు.  వారిలో సుకుమార్ కూడ ఉన్నారు. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు. మొదటి పార్ట్ ఆఖరి దశలో ఉండగా షూటింగ్ ఆగింది.
 
చిత్రీకరణ మొదలుకావడానికి ఇంకొన్ని రోజులు పట్టేలా ఉంది. సుకుమార్ ఈ ఖాళీ సమయాన్ని కొత్త ప్రాజెక్ట్ మీద కేటాయిస్తున్నారు. అదే విజయ్ దేవరకొండ చిత్రం. వీరిద్దరి ప్రాజెక్ట్ చాలా నెలల క్రితమే ఫైనల్ అయింది. కరోనా లేకుండా ఉంటే ఈపాటికి ‘పుష్ప’ పూర్తయి వీరి సినిమా మొదలయ్యేదే కానీ ఆలస్యమైంది. అందుకే ‘పుష్ప’ నుండి బయటకు రావడమే ఆలస్యం విజయ్ సినిమాను పట్టాలెక్కించాలనే ఉద్దేశ్యంతో సుకుమార్ కథను ఫైనల్ చేసుకున్నారట. 
 
అంతేకాదు ఈ చిత్రం తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రం. అందుకే లొకేషన్స్ కూడ వెతుక్కుంటున్నారట.  మరోవైపు విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ ‘లైగర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు.  అది ముగిసిన వెంటనే సుకుమార్ సినిమాలో జాయిన్ అవుతాడు.  సో.. సుకుమార్, విజయ్ ఇద్దరూ ఎవరికి వారు కొత్త సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు.