త‌న మ్యూజిక్‌తో సుకుమార్‌ని డ్యాన్స్ చేయించిన దేవి శ్రీ ప్ర‌సాద్- వీడియో

దేవి శ్రీ ప్ర‌సాద్ .. ఈ మ్యూజిక్ సెన్సేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న సంగీతంతో ల‌క్ష‌లాది ప్రేక్ష‌కుల‌ని రంజింజేస్తూ వ‌స్తున్న దేవి తాజాగా ఉప్పెన సినిమాకు అద్భుత‌మైన సంగీతం అందించారు. ఈ సినిమాలోని నీ క‌ళ్ళు నీలి స‌ముద్రం నా మ‌న‌సేమో అందుట్లో ప‌డ‌వ ప్ర‌యాణం అనే పాట కొన్ని మిలియ‌న్ వ్యూస్‌ను రాబ‌ట్టింది. ప్ర‌తి ఒక్క సంగీత ప్రియుడిని ఎంత‌గానో అల‌రించిన ఈ సాంగ్ వ‌ల‌న‌నే ఉప్పెన సినిమాకు ఆ రేంజ్‌లో గుర్తింపు ద‌క్కింది. వైష్ణ‌వ్ తేజ్ డెబ్యూ సినిమా ఉప్పెన కాగా, ఈ పాట‌తో సినిమా చూసేందుకు ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తి చూపుతున్నారు.

ఉప్పెన సినిమా కోసం దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌ర‌ప‌రిచిన బాణీలు అన్నీ సంగీత ప్రియుల‌ని ఊయ‌ల‌లూగించేస్తున్నాయి. చంద్ర‌బోస్, శ్రీమ‌ణి అందించిన లిరిక్స్‌కు త‌గ్గ‌ట్టు దేవి శ్రీ ప్రసాద్ త‌న‌దైన స్టైల్‌లో బాణీలు అందించ‌గా, ఇందులోని రంగుల‌ద్దుకున్నా సాంగ్ అంద‌రి మ‌న‌సులు దోచేసింది. ఈ సాంగ్ సిట్టింగ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇందులో పాట‌ల ర‌చ‌యిత చంద్ర‌బోస్ రాసిన రంగుల‌ద్దుకున్నా పాట‌కు డీఎస్పీ గిటార్ వాయిస్తూ పాట పాడుతుంటే..డైరెక్ట‌ర్ స‌కుమార్ స్టెప్పులేశాడు.

బుచ్చిబాబు, డీఎస్పీ, చంద్ర‌బోస్ రికార్డింగ్ రూంలో ఉండ‌గా..సుకుమార్ స్టైలిష్ డ్యాన్స్ చేయ‌డం అంద‌రిని అల‌రిస్తుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది. ఈ చిత్రంలో వైష్ణ‌వ్‌తేజ్ హీరోగా న‌టిస్తుండ‌గా..కృతిశెట్టి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఫిబ్ర‌వ‌రి 12న చిత్రం విడుద‌ల కానుంది.ఈ సినిమాకు ఏకంగా 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపోయేలా చేస్తుంది. క‌రోనా లేకుండా ఉంటే ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు ల‌వ‌ర్స్ డే సంద‌ర్భంగా ఫిబ్ర‌వరి 12కు థియేట‌ర్స్‌లో వ‌స్తుంది. విజ‌య్ సేతుప‌తి చిత్రంలో విల‌న్‌గా న‌టించారు.

Ranguladdhukunna Original Composition | Uppena | DSP Studio | Devi Sri Prasad