Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి వరస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టినప్పటికీ ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా ఈయన గ్లోబల్ స్టార్ అనే ఇమేజెస్ సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఈ ప్రస్తుతం రామ్ చరణ్ బుజ్జిబాబు డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం తిరిగి సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమాకు కమిట్ అవ్వబోతున్నారు ఈ రెండు సినిమాలపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఇదివరకే రంగస్థలం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సుకుమార్ రామ్ చరణ్ సన్నివేశాలకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు రంగస్థలం సినిమాలో ప్రకాష్ రాజుకు ఈయన సేవలు చేస్తూ కనిపిస్తారు అలాగే వంట చేయడం గిన్నెలు తోమడం వంటివన్నీ కూడా చేస్తుంటారు. ఇలాంటి సన్నివేశాలను రామ్ చరణ్తో కాకుండా మరెవరితోనైనా చేయించే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం కానీ రామ్ చరణ్ తానే నటిస్తానని తెలిపారు.
ఇలా ఈ సన్నివేశాలలో చరణ్ చాలా సహజంగా కనిపించారు అయితే చిరంజీవి ఈ సీన్స్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట. ఈ సన్నివేశాలు అన్నీ నువ్వే నేర్పించావు కదా అంటూ నన్నే అడిగారని సుకుమార్ తెలిపారు లేదు సర్ ఆయనే చేశారు అని చెప్పడంతో చిరంజీవి షాక్ అవుతూ మరోవైపు చాలా సంతోషం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇక ఏదైనా ఒక పాత్రలో నటించాలి అంటే చరణ్ ఆ పాత్రలో లీనం అవుతారని చెప్పాలి.