రష్మిని పక్కకునెట్టి సుధీర్ కి జోడీగా సందడి చేయనున్న అనసూయ..!

బుల్లి తెరపై బాగా పాపులరైన జోడిలో సుధీర్ రష్మీ ఢీ జోడి ఒకటి. వీరిద్దరూ ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యారు. ఇద్దరు కలిసి జోడీగా ఎన్నో షోలలో సందడి చేశారు. ఆన్ స్క్రీన్ మీద వీరిద్దరి మద్య ఉన్న కెమిస్ట్రీ కారణంగా చాలా మంది వీరిద్దరు ప్రేమలో ఉన్నారని భావిస్తున్నారు. కొన్ని ఈవెంట్లలో వీరిద్దరి పెళ్లి జరిపించిన ఘటనలు కూడ చాలా ఉన్నాయి. వీరిద్దరు ఇలా రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో కూడ పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది అని వారి అభిమానులు ఆశ పడుతున్నారు.

ఇక వీరిద్దరు కలసి ఏదైనా షో చేశారంటే ఆ షో కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది . ఢీ షోలో సందడి చేసిన వీరు కొంతకాలం ఆ షోలో కనిపించకుండా పోవటంతో ఆ షో రేటింగ్స్ పడిపోయాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం సుధీర్ మా మాటీవీలో ప్రసారం కానున్న సూపర్ సింగర్ జూనియర్స్ షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ షో లో సుధీర్ కి జోడీగా అనుసుయా సందడి చేయనుంది. ఇలా సుధీర్ కి జోడీగా రష్మికి బదులు అనసూయని పెట్టడంతో వారి అభిమానులు కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

స్టార్ మాలో ప్రసారం కానున్న ఈ సూపర్ సింగర్ జూనియర్స్ షో కి సుధీర్ కి జోడీగా అనసూయని పెట్టడంతో సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఆసక్తి కామెంట్స్ చేస్తున్నారు. సుధీర్ పక్కన రష్మిని కాకుండ అనసూయని ఎలా పెట్టారు అంటూ మా టీవి యాజమాన్యం మీద విమర్శలు చేస్తున్నారు. సుధీర్ కి జోడిగా అనసూయకు బదులు రష్మిని పెట్టుంటే ఆ షో కి ఇంకా ఎక్కువ రేటింగ్స్ వచ్చేవి అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి మాటీవీలో సుధీర్ అనసూయ సూపర్ సింగర్ జూనియర్స్ షో ద్వారా సందడి చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.