Sudigali Sudheer: పుష్ప సినిమా స్ఫూఫ్ తో రికార్డ్స్ బద్దలు కొడుతున్న సుడిగాలి సుధీర్..?

Sudigali Sudheer: జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెర పై యాంకర్ గా, కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇకపోతే ఎక్సట్రా జబర్దస్త్ షోని కేవలం సుధీర్ స్కిట్ కోసం చూసేవాళ్ళు ఉన్నారు అనడంలో ఎటువంటి అతియోశక్తి లేదు. ఇది ఇలా ఉంటే సుడిగాలి సుధీర్ లేటెస్ట్ స్కిట్ కి ప్రస్తుతం యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇటీవల ఎక్సట్రా జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్ టీమ్ పుష్ప సినిమా స్పూఫ్ చేసిన విషయం తెలిసిందే. పుష్ప స్పూఫ్ గా తెరకెక్కిన స్కిట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.

జబర్దస్త్ షో టాప్ టీమ్స్ లో ఒకటిగా ఉన్న సుడిగాలి సుధీర్ టీమ్ పుష్ప స్పూఫ్ చేశారు. ఈ స్కిట్ లో సుధీర్ అల్లు అర్జున్ పుష్ప గెటప్ వేయగా, గెటప్ శ్రీను ఫహాద్ ఫాజిల్ చేసిన భన్వర్ లాల్ షెకావత్ గా, రామ్ ప్రసాద్ కేశవ గెటప్ వేయడం జరిగింది. ఈ స్కిట్ తో నాన్ స్టాప్ పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ప్రస్తుతం ఈ స్కిట్ యూట్యూబ్ లో రికార్డును అందుకుంది. కేవలం ఆరు రోజుల్లోనే సుడిగాలి సుధీర్ స్కిట్ 10 మిలియన్ల వ్యూస్ ని దాటేసింది. ఒక వారం వ్యవధిలో కోటి దాటిపోవడం రికార్డ్ అని చెప్పవచ్చు.

అదేవిధంగా హైపర్ ఆది కూడా పుష్ప సినిమా స్పూఫ్ చేయగా అది కూడా 12 మిలియన్ల వ్యూస్ దాటేయడం విశేషం. పుష్ప సినిమాలోని మేనరిజాన్ని సామాన్యుడి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం సుడిగాలి సుదీర్ స్కిట్ యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. ఇకపోతే పుష్ప సినిమా విషయానికి వస్తే.. పుష్ప సినిమా అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది. అంతే కాకుండా బాలీవుడ్ లో సైతం అతనికి ఊహించని విధంగా భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక పుష్ప పార్ట్ 2 ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సెకండ్ పార్ట్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దర్శకుడు సుకుమార్ కూడా పుష్ప పార్ట్ 2 భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తీర్చిదిద్దనున్నట్లు సమాచారం.