Sudigaali Sudheer: ఒక ఇంటివాడైన సుడిగాలి సుధీర్… కానీ శోభనం కాకుండానే పెళ్ళాం లేచిపోయిందట.. పాపం!

sudigali sudheer tests corona positive?

Sudigaali Sudheer: బుల్లితెర పై మంచి పేరు సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడో మిమిక్రీ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ ఉన్నటువంటి సుడిగాలి సుదీర్ బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలోకి ఒక కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత టీం లీడర్ గా మారడమే కాకుండా ప్రస్తుతం ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ వెండితెరపై అవకాశాలను అందుకొని ఇలా రోజురోజుకు అభివృద్ధి చెందుతూ విశేషమైన ఆదరణ సంపాదించుకున్నారు.ఇలా బుల్లితెరపై వెండితెర పై ఎంతో బిజీగా ఉన్నటువంటి సుడిగాలి సుధీర్ కి సంబంధించిన ఎలాంటి విషయమైనా సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అవుతుంది.

ఇకపోతే సుడిగాలి సుదీర్ ఈవారం ప్రసారం కాబోయే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో చేసిన స్కిట్ ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ వారం విడుదల చేసిన ప్రోమో చూస్తే ఇందులో సుధీర్ తన కామెడీ ద్వారా మరొకసారి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ ప్రోమోలో భాగంగా సుడిగాలి సుధీర్ తోఆటో రాంప్రసాద్ మాట్లాడుతూ ఏమీ అనుకోకురా నీ పెళ్ళికి రాలేదని చెప్పగా అందుకు సుధీర్ రాక పోవడమే మంచిది అంటూ సమాధానం చెబుతాడు. అంతలోగా పాలు వాడు వస్తే.. వెంటనే రామ్ ప్రసాద్ చెల్లెమ్మ పాలబ్బాయి వచ్చాడు అంటూ కేక వేస్తాడు.ఒరేయ్ సుదీర్ చెల్లిని రమ్మను అని ఆటో రాంప్రసాద్ చెప్పగా చెల్లి రాదు నేనువెళ్తే తను వస్తుందని చెప్పి లోపలికి వెళ్ళాడు.

అయితే సుడిగాలి సుధీర్ భార్య లేకపోవడంతో తానే లేడీ గెటప్ లో వచ్చి పాలు వేయించుకుని వెళ్తుండగా ఆటో రాంప్రసాద్ మీ పెళ్ళికి రాలేదని ఫీల్ అవ్వకమ్మ అంటే అందుకు సుదీర్ లేడీ వాయిస్ తో మరేం పర్లేదు అంటుంది. రేయ్ రామకృష్ణ అంటూ తన కొంగు లాగగా వెంటనే సుదీర్ పెట్టుకున్న విగ్ పడి పోవడంతో అసలు విషయం బయట పెట్టాడు. ప్రస్తుతం తన భార్య లేదని పెళ్లి కాకముందే పీటలు ముందు నుంచి తన భార్య లేచి పోయిందని సుధీర్ ఏడుస్తూ అసలు విషయం బయట పెట్టాడు. అది విన్న ఆటో రాంప్రసాద్ మా వాడి పెళ్ళాం లేచిపోయిందంటా అంటూ గట్టిగా అరవడంతో సుధీర్ ఆపమని చెప్పి గట్టిగా ఏడుస్తాడు. ఏం జరిగింది రా అలా ఏడుస్తున్నావ్ అంటూ మరోసారి రాంప్రసాద్ అడగడంతో శోభనం జరగకుండానే లేచిపోయింది రా అంటూ ఏడుస్తూ చేసినటువంటి ఈ స్కిట్ అందరి చేత నవ్వులు పూయించింది.