ఆ షో కారణంగా జబర్దస్త్ ని వీడనున్న సుధీర్.. ఆందోళనలో అభిమానులు?

బుల్లి తెర మీద ప్రసారమౌతున్న రియాలిటీ షోలలో జబర్దస్త్ కూడా ఒకటి. ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ కామెడీ షో గత కొన్ని సంవత్సరాలుగా ప్రసారమవుతుంది. ప్రతి గురు, శుక్రవారాలలో ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. జబర్దస్త్ కామెడీ షో కి దీటుగా ఎన్ని కామెడీ షో లు వచ్చినా కూడా నిలవలేక పోతున్నాయి. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. అటువంటి వారిలో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు. సుధీర్ యాంకర్ గా, నటుడిగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

శుక్రవారం ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ షో లో సుధీర్ తన టీమ్ తో కలిసి చేసే సందడి అంత ఇంత కాదు. తన కామెడీ టైమింగ్ తో గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులని అలరిస్తున్నాడు. అయితే సుధీర్ ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ఇలా సినిమాలు, రియాలిటీ షోలలో నిత్యం బిజీగా ఉండే సుధీర్ గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాల వైరల్ అవుతోంది. తనకి జీవితాన్ని ఇచ్చిన జబర్దస్త్ షో ని సుధీర్ వీడనున్నాడు అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

సుధీర్ ఒకవైపు సినిమాలతో, మరొకవైపు టీవీ షోస్ తో బిజీగా ఉండటం వల్ల తనకి డేట్స్ కుదరక జబర్దస్త్ వీడనున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న ” శ్రీదేవి డ్రామా కంపెనీ” షోలో మాత్రమే కనిపించనున్నాడు అని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సుధీర్ అభిమానులు సుధీర్ కూడా జబర్దస్త్ నుండి వెళ్ళిపోతే
జబర్దస్త్ కు పెద్ద దెబ్బ పడుతుందని అంటున్నారు. ఇప్పటికే చంద్ర, అభి, ఆది వంటి వారు జబర్దస్త్ నుండి వెళ్ళిపోవటం వల్ల జబర్దస్త్ రేటింగ్స్ బాగా పడిపోయాయి. ఇప్పుడు సుధీర్ కూడా వెళ్లిపోతే జబర్దస్త్ కు చాలా నష్టం. అయితే ఈ విషయం గురించి సుధీర్ ఇప్పటి వరకూ ఎక్కడ స్పందించలేదు. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే కొంత సమయం వేచి చూడాల్సిందే.