సుధీర్, శ్రీను జబర్ధస్త్ నుండి వెళ్ళిపోవటానికి గల అసలు కారణం అతనేనా?

బుల్లితెర మీద ఎన్నో టీవీ షోలు ప్రసారం అవుతూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. అటువంటి వాటిలో జబర్దస్త్ కామెడీ షో కూడా ఒకటి. గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ టీవీ లో ప్రచారం అవుతున్న ఈ కామెడీ షో ప్రేక్షకులను అలరిస్తూ మంచి ప్రేక్షకాదరణ పొందింది. అయితే కొన్ని రోజులుగా జబర్దస్త్ లో జరుగుతున్న పరిణామాల వల్ల జబర్దస్త్ రేటింగ్స్ దారుణంగా పడిపోతున్నాయి. ఈ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్లు అందరూ ఈ షో నుండి వెళ్ళిపోతున్నారు. హైపర్ ఆది కామెడీ పంచ్ లతో జబర్దస్త్ పాపులారిటీ మరింత పెంచాడు. మరొకవైపు సుడిగాలి సుధీర్ టీమ్ కూడ ఎక్స్ ట్రా జబర్దస్త్ షో హిట్ అవ్వటానికి ముఖ్య కారణమని చెప్పవచ్చు.

అయితే గత కొంత కాలంగా హైపర్ ఆది సుడిగాలి సుదీర్ జబర్దస్త్ లో కనిపించడం లేదు. అందువల్ల ప్రేక్షకులు చాలా నిరాశ చెంది వారు జబర్దస్త్ కి తిరిగి రావాలని డిమాండ్ చేస్తున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శీనుకి సినిమా అవకాశాలు రావడంతో జబర్దస్త్ ని వదిలి వెళ్లారు అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ సుధీర్ జబర్దస్త్ మా టీవీలో ప్రసారమవుతున్న సూపర్ సింగర్స్ షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. అందువల్ల సుధీర్ నిజంగా సినిమా అవకాశాలు ఎక్కువ రావడం వల్ల జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాడా? అంటూ ప్రేక్షకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ గెటప్ శ్రీను స్నేహం గురించి ఒక స్కిట్ కూడా చేశారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ నేను ఒంటరివాన్ని అయ్యాను అన్న ఫీలింగ్ కలుగుతోంది అంటూ స్టేజ్ మీద ఎమోషనల్ అయ్యాడు.

తాజాగా ఈవారం ప్రసారం కాబోయే జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమో లో ఇంద్రజ జబర్దస్త్ టీం లీడర్లు అందరినీ తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ సందర్భంగా ఇంద్రజ రామ్ ప్రసాద్ ని కూడా ఒక ప్రశ్న వేసింది. నువ్వు స్క్రిప్ట్ సరిగా రాకపోవడం వల్లే సుడిగాలి సుధీర్ గెటప్ శీను జబర్దస్త్ మానేశారు అని అంటున్నారు ఇది ఎంతవరకు నిజం? అని రాంప్రసాద్ అని ప్రశ్నించింది. దీనికి రాంప్రసాద్ సమధానం చెప్పాడు. కానీ అది ప్రేక్షకులకి వినిపించకుండా చేశారు. దీనికి సమాధానంగా తెలియాలంటే ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి .