రాధేశ్యామ్ నుండి స‌ర్‌ప్రైజింగ్ వీడియో.. ఆనందంలో తేలియాడుతున్న అభిమానులు

బాహుబ‌లి చిత్రంతో బాక్సాఫీస్ దగ్గ‌ర కాసుల వ‌ర్షం కురిపించిన ప్ర‌భాస్ ఆ త‌ర్వాత సాహో అనే చిత్రం చేశాడు. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది. దీంతో ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తున్న రాధేశ్యామ్ చిత్రంపై హోప్స్ పెట్టుకున్నాడు. రాధేశ్యామ్ చిత్రాన్ని జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, ఇందులో ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య పాత్రలో క‌నిపించ‌నుండ‌గా, పూజాహెగ్డే.. ప్రేర‌ణ పాత్ర‌లో సంద‌డి చేయ‌నుంది. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రం కూడా వస్తుంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

రాధేశ్యామ్ సినిమా కోసం చిత్ర బృందం ఎక్క‌వు రోజుల పాటు ఇట‌లీలోనే ఉంది. క‌రోనా విజృంభిస్తున్న స‌మ‌యంలోను మూవీ టీం అక్క‌డ షూటింగ్ చేసింది. క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసారు. కొద్ది రోజుల క్రితం ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. స‌మ్మ‌ర్‌లో చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. అయితే ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, తాజాగా క్రేజీ వీడియో విడుద‌ల చేశారు.

రాధేశ్యామ్ టీజ‌ర్ విష‌యాన్ని తెలియ‌జేసేందుకు ప్రీ టీజ‌ర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్ర‌భాస్ స్టైలిష్‌గా న‌డుచుకుంటూ వ‌స్తుండ‌గా, ఇందులో ప్ర‌భాస్ లుక్ ఫ్యాన్స్‌కు మంచి థ్రిల్ క‌లిగిస్తుంది. ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల కానున్న టీజ‌ర్ ఫ్యాన్స్‌కు మాంచి కిక్ ఇస్తుందని ఫ్యాన్స్ న‌మ్ముతున్నారు. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ చిత్రానికి సంగీతం అందించ‌నుండ‌గా, ఈ మూవీకి సంబంధించి ఒక్కో పాట‌ను విడ‌త‌ల వారీగా రిలీజ్ చేయ‌నున్నారు.

Pre Teaser of Radhe Shyam | Prabhas | Pooja Hegde | Radha Krishna Kumar | Glimpse on February 14th