Sameera Reddy : సమీరా రెడ్డి గురించి మీకీ విషయాలు తెలుసా.?

Sameera Reddy : బాలీవుడ్ భామగా పిలుచుకునే సమీరా రెడ్డి తెలుగు మూలాలున్న అమ్మాయే. ఆమె తండ్రి తెలుగు వ్యక్తి. తల్లి మంగోలియన్. సమీరారెడ్డి తెలుగులో ‘జై చిరంజీవ’, ‘అశోక్’, ‘నరసింహుడు’ సినిమాల్లో నటించింది.

యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో సమీరారెడ్డి ప్రేమ, పెళ్లి విషయాలు అప్పట్లో ఓ సెన్సేషన్. ఇంకేముంది ఎన్టీయార్ అభిమానులయితే, సమీరా రెడ్డిని ‘వదినమ్మ’గా ఫిక్సయిపోయారు కూడా. కానీ, ఆ తర్వాత అదంతా ఉత్త పుకార్లే అని తేలిపోయింది.

ఆ తర్వాత ఓ బిజినెస్ మేన్‌ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకి తల్లి కూడా అయ్యింది. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో అండర్ వాటర్ షూట్స్ అంటూ బేబీ బంప్‌తో సమీరా రెడ్డి చేసిన ఫీట్లు ఎప్పటికీ మర్చిపోలేము. ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయ్ ఆ పిక్స్.

ఇకపోతే, సమీరా రెడ్డి చాలా డేరింగ్ అండ్ డాషింగ్ విమెన్. అందుకే ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావాలని ఓ జాతీయ పార్టీ తెగ ట్రై చేస్తోందట. కానీ, రాజకీయాల్లో ఎంట్రీ విషయమై సమీరా రెడ్డి ఎప్పుడూ పెద్దగా స్పందించింది లేదు.

అన్నట్లు సమీరారెడ్డికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చాలా చాలా ఎక్కువ. ఆ కారణంగానే ‘సమీరా ది స్ట్రీట్ ఫైటర్’ అనే పేరుతో ఓ గేమ్ కూడా రూపొందింది.

మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఆ గేమ్‌ని డౌన్‌లోడ్ చేసుకుని ఆడేయడం విశేషం. ఇంత పాపులారిటీ వున్న సమీరా రెడ్డి సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేస్తుందేమో చూడాలి మరి.