అంతర్జాతీయ సానుకూల పవనాలతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రెడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా లాభపడి 1023 పాయింట్ల వృద్ధితో 57,850 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 286 పాయింట్లు వృద్ధి చెంది.. ప్రస్తుతం 17,262 వద్ద ట్రేడవుతోంది. అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపుతో ప్రపంచ మార్కెట్లు రాణిస్తుండడంతో.. దేశీయ మార్కెట్లు లాభాల బాట పట్టినట్లు తెలుస్తోంది. ముడి చమురు ధరలు తగ్గడం, విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడులకు మొగ్గుచూపడం ద్వారా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి.
