50 కోట్ల చుట్టూ తిరుగుతున్న మన హీరోలు

Stars charging heavy remuneration
Stars charging heavy remuneration
కరోనా కష్ట కాలంలో ఎన్ని తగ్గినా మన హీరోల పారితోషకం మాత్రం తగట్లేదు. అన్నీ బాగున్నప్పుడు ఎలా డిమాండ్ చేస్తున్నారో ఇప్పుడూ అలాగే డిమాండ్ చేస్తున్నారు.  స్టార్ హీరోలు ఉన్నది ఆ ఆరేడు మందే కావడంతో నిర్మాతలు కూడ వెనుకాడకుండా ఆడిగినంతా ఇచ్చి డేట్స్ బుక్ చేసుకుంటున్నారు.  ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా 50 కోట్ల మార్క్ దాటేశారు.  ప్రభాస్ ప్రతి పాన్ ఇండియా సినిమాకు దగ్గర దగ్గర 80 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నాడు.  
 
ఇక పవన్ కళ్యాణ్ అయితే అది పాన్ ఇండియా సినిమానా, మామూలు సినిమానా అనే తేడా లేకుండా రోజుకు కోటి చొప్పున ఎన్ని రోజులు షూటింగ్ చేస్తే అన్ని కోట్లు తీసుకుంటున్నారు.  ఈ లెక్కన ఆయన రెమ్యునరేషన్ కూడ 50 కోట్లకు పైమాటే.  ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం 50 కోట్లకు దగ్గర్కో ఉన్నారట.  ‘సర్కారువారి పాట’ చిత్రానికి అన్నీ కలిసి 50 కోట్ల వరకు పుచ్చుకుంటున్నారని వినికిడి.  ఇక అల్లు అర్జున్ కూడ 50 కోట్ల మార్క్ చేరుకునే పనిలోనే ఉన్నారు.  ‘పుష్ప’ సక్సెస్ అయితే మాత్రం నిలబెట్టి 50 కోట్లు వసూలు చేస్తారు ఆయన.  ఎన్టీఆర్, రామ్ చరణ్ టార్గెట్ కూడ అదే.  ‘ఆర్ఆర్ఆర్’కు ఎలాగూ 50 కోట్ల వరకు పుచ్చుకుంటున్న ఈ ఇద్దరూ ఆ తర్వాత కూడ అదే రేటు కొనసాగించాలని అనుకుంటున్నారు.