‘ఆర్ఆర్ఆర్’ సహా బడా సినిమాలన్నీ వారి చేతిలోనే !

Star Maa bags big movies satellite rights
Star Maa bags big movies satellite rights
సినిమాలు థియేటర్లలో వచ్చినా, ఓటీటీలో విడుదలైనా వాటి అంతిమంగా బుల్లితెర మీదకు రావలసిందే.  అందుకే శాటిలైట్ హక్కులకు మంచి డిమాండ్ ఉంటుంది. పెద్ద పెద్ద ఛానెల్స్ అన్నీ ఈ హక్కులను కొనుగోలు చేయడానికి పోటీపడుతుంటాయి.  అలా ఎప్పుడూ పోటీలో ముందుండే ఛానెల్ స్టార్ మా. ఎప్పటికప్పుడు తన స్టాండర్డ్స్ నిరూపించుకోవడానికి భారీ వ్యయంతో స్టార్ హీరోల సినిమాలను కొంటూ ఉంటుంది స్టార్ మా.  అందుకే టిఆర్పీ రేటింగ్స్ పరంగా ఎప్పుడూ అగ్ర స్థానంలో ఉంటుంది.  ఇప్పటికిప్పుడు చూసుకున్నా స్టార్ మా చేతిలో 10కి పైగా పెద్ద సినిమాలు ఉన్నాయి.
 
ఇవన్నీ కూడ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలే కావడం విశేషం. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న అతి పెద్ద మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రైట్స్ స్టార్ మా వద్దనే ఉన్నాయి.  అలాగే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ హక్కులు, బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల ‘అఖండ’, రవితేజ ‘ఖిలాడి’, నాగచైతన్య ‘లవ్ స్టోరీ’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’, నాని ‘టక్ జగదీష్’, మహేష్ బాబు-పరశురామ్ కలయికలో రూపొందుతున్న ‘సర్కారువారి పాట’ లాంటి మోస్ట్ అవైటెడ్ చిత్రాల శాటిలైట్ హక్కులు స్టార్ మా సొంతం చేసుకుంది.  ఇవే కాదు ఇంకొన్ని సినిమాల రైట్స్ కొనే ప్రయత్నాల్లో ఉంది ఈ ఛానెల్.