మిల్కీ బ్యూటీ తమన్నా ఆస్తుల విలువ తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే?

గడిచిన 17 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్లలో తమన్నా ఒకరనే సంగతి తెలిసిందే. ఎఫ్3 సినిమాతో మరో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న తమన్నా 50కు పైగా సినిమాలలో నటించగా ఈ సినిమాలలో హిట్టైన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ స్టార్ హీరోయిన్ ఆస్తుల విలువ 110 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని సమాచారం అందుతోంది.

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు కూడా తమన్నా అదే విధంగా ఉండటం గమనార్హం. ముంబైలో మిల్కీ బ్యూటీ తమన్నాకు అద్భుతమైన ఇల్లు కూడా ఉంది. ఒకవైపు అభినయానికి ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ లో నటిస్తూనే మరోవైపు గ్లామరస్ రోల్స్ లో కూడా నటిస్తూ తమన్నా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు తమన్నా పలు వ్యాపారాలలో డబ్బులను ఇన్వెస్ట్ చేశారని సమాచారం.

కుక్కలంటే కూడా తమన్నాకు ఎంతో ఇష్టం కాగా గత 9 సంవత్సరాలుగా ఒక కుక్కను పెంచుకుంటున్నారు. తల్లి చేసే టీ తమన్నాకు ఇష్టమైన వంటకం కావడం గమనార్హం. తన తండ్రి తనకు బలం అని పలు సందర్భాల్లో ఈమె చెప్పుకొచ్చారు. తన ఇల్లు తనకు ప్రతిరోజూ కొత్తగా కనిపిస్తుందని తమన్నా అన్నారు. తమన్నా నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది.

భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. సత్యదేవ్ ఈ సినిమాలో హీరోగా నటించారు. సత్యదేవ్, తమన్నా కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ కీలకమని చెప్పవచ్చు. త్వరలో ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.