Shruti Haasan : ప్రభాస్ పై కొన్ని నిజాలు బయటపెట్టిన స్టార్ హీరోయిన్ శృతి హాసన్.!

Shruti Haasan : ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని ఆపడం ఏ ఇండస్ట్రీకి చెందిన హీరో వల్ల కూడా అయ్యేలా కనిపించడం లేదు. ఆ రేంజ్ లో ప్రభాస్ తన స్టార్డం ని సెట్ చేసుకొని దూసుకెళ్తున్నాడు. మరి అలా ఇప్పుడు పలు ఆసక్తికర భారీ సినిమాలను చేస్తూ వెళ్తున్నాడు. ఇక ఇప్పుడు ఆల్రెడీ వాటిలో మొదటి భారీ సినిమా రాధే శ్యామ్ ని కంప్లీట్ కూడా చేసేసాడు.

అది రిలీజ్ కి రెడీగా కూడా ఉంది. కానీ డేట్ కోసం ఎదురు చూస్తుండగా తన కెరీర్ లో మరో భారీ మాస్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్న సినిమా “సలార్” నుంచి హీరోయిన్ శృతి హాసన్ అతడిపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చెయ్యడం ఇండస్ట్రీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది. లేటెస్ట్ గా ఇచ్చిన ఒక స్టేట్మెంట్ లో ప్రభాస్ ఒక వండర్ ఫుల్ వ్యక్తి అని.

రెండోది తనకి ఆశ్చర్యకర అంశంగా అనిపించింది ఏదన్నా ఉంది అంటే అతడు పెద్ద ఫుడీ.ఫుడ్ విషయంలో ప్రభాస్ తీసుకునే కేర్ కానీ అతడు చూపించే ప్రేమ కానీ నమ్మలేని విధంగా ఉంటుంది. తానే స్వయంగా అందరికీ ఆహారం వడ్డించాలి అనుకుంటాడు. ఇది నాకు అతనిలో బాగా నచ్చిన విషయం.

ఇలా ఫుడ్ తోనే తన ప్రేమ అంతటినీ అందరికి పంచాలని చూస్తాడు అని శృతి హాసన్ తెలిపింది. ఏదైతే అది కానీ ప్రభాస్ కి ఫుడ్ పట్ల ఇష్టం ఉందని అందరికీ తెలుసు కానీ ఈ రేంజ్ లో ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు. ఫైనల్ గా ఈ కొత్త నిజాన్ని అయితే ఆమె ద్వారా ఇపుడు బయటకి వచ్చింది.