టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరైన నితిన్ కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను అందుకుని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురైనా ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలతో నితిన్ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన అ.ఆ నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తున్నారు.
తాజాగా నితిన్ డిస్ట్రిబ్యూట్ చేసిన విక్రమ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుని భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. నితిన్ భార్య పేరు షాలిని కందుకూరి కాగా ఈ బ్యాగ్రౌండ్ తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవడం ఖాయమని చెప్పవచ్చు. అయితే పెళ్లయ్యే వరకు నితిన్ భార్య షాలిని గురించి అభిమానులకు పెద్దగా తెలియలేదు. నితిన్ కూడా పెళ్లికి ముందు షాలినితో కలిసి బయటకు వెళ్లిన సందర్భాలు చాలా తక్కువని సమాచారం.
పెళ్లికి ముందు వీళ్లిద్దరూ కలిసి కనీసం ఫోటోలు దిగిన సందర్భాలు సైతం ఎక్కువగా లేవని సమాచారం. పెళ్లికి ముందు పార్క్ హయాత్ హోటల్ లో నితిన్, షాలిని ఎక్కువగా కలిసేవారని బోగట్టా. షాలిని సోషల్ మీడియలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండరు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన షాలిని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. షాలిని తల్లీదండ్రులు డాక్టర్లు కావడం గమనార్హం.
షాలిని లండన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారని బోగట్టా. లండన్ లో ఎంబీఏ చదివిన షాలిని ఒక కంపెనీలో హెచ్.ఆర్ గా పని చేశారని తెలుస్తోంది. నితిన్ కు, షాలిని మధ్య వయస్సులో ఆరేళ్ల తేడా ఉందని బోగట్టా. షాలిని ఫేవరెట్ హీరోయిన్ సమంత కాగా షాలినికి కుక్కలు అంటే చాలా ఇష్టమని సమాచారం. నాలుగేళ్లు ఒకరినొకరు ప్రేమించుకుని నితిన్ షాలిని పెళ్లి చేసుకునన్నారని సమాచారం.