స్టార్ హీరో నాగార్జున వివాదాలకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. అవతలి వాళ్లను హర్ట్ చేయకూడదని భావించి వివాదాస్పద అంశాల గురించి మాట్లాడటానికి కూడా నాగార్జున దూరంగా ఉన్నారు. ఒకవైపు స్టార్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు వ్యాపారవేత్తగా కూడా నాగార్జున రాణిస్తున్నారు. అభిమానులు ప్రేమగా కింగ్ అని పిలుచుకునే నాగార్జున కెరీర్ లో ఎంతోమంది కొత్త డైరెక్టర్లకు అవకాశాలను ఇచ్చారు.
దర్శకుడు సక్సెస్ లో ఉన్నా ఫ్లాప్ లో ఉన్నా నాగార్జున మాత్రం కథ నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు కొన్నిసార్లు తన సినిమాలకు తనే నిర్మాతగా వ్యవహరించారు. అయితే కూల్ గా ఉండే నాగార్జున ఒక స్టార్ హీరోయిన్ ను మాత్రం తిట్టారని సమాచారం. నాగార్జునతో ఎక్కువ సినిమాలలో నటించిన హీరోయిన్లలో ఒకరైన శ్రియ బద్ధకం వల్ల నాగార్జునతో తిట్లు తిన్నారని తెలుస్తోంది. చాలా సంవత్సరాల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది.
టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోలలో ఒకరైన నాగార్జునకు ఈతరం హీరోయిన్లలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ హీరోయిన్లు సైతం నాగార్జునతో కలిసి నటించడానికి ఆసక్తి చూపేవారంటే నాగార్జునకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో సులభంగానే అర్థమవుతుంది. నాగ్ నటించిన పలు బాలీవుడ్ సినిమాలు కూడా సక్సెస్ సాధించాయి. ఒక ఇంటర్వ్యూలో నాగ్ మాట్లాడుతూ తాను చూసిన హీరోయిన్లలో బద్ధకం ఉన్న హీరోయిన్ శ్రియ అని చెప్పారు.
శ్రియ షూటింగ్ కు ఆలస్యంగా రావడం వల్ల ఆమె పలు సందర్భాల్లో సెట్లోనే తనతో తిట్లు తిందని నాగార్జున చెప్పుకొచ్చారు. కాంతివంతమైన ముఖం ఉన్న హీరోయిన్ అనుష్క అని వాగుడుకాయ రమ్యకృష్ణ అని నాగార్జున ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే నాగార్జున గతంలో చేసిన ఈ కామెంట్ల గురించి హీరోయిన్ శ్రియ మాత్రం అస్సలు స్పందించకపోవడం గమనార్హం.