బాక్సాఫీస్ వద్ద బాలయ్య సృష్టించిన సంచలన రికార్డ్ ఏంటో మీకు తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ సింహా, లెజెండ్, అఖండ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను అందుకున్నారు. అయితే ఒకే ఏడాదిలో ఆరు బ్లాక్ బస్టర్ హిట్లు సాధించిన అరుదైన ఘనత బాలయ్య ఖాతాలో ఉంది. టెంపర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు జూనియర్ ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ సాధిస్తే ఒకే ఏడాదిలో బాలయ్య డబుల్ హ్యాట్రిక్ సాధించి అప్పట్లో వార్తల్లో నిలిచారు.

1986 సంవత్సరంలో బాలయ్య కెరీర్ లో మరిచిపోలేని సంవత్సరం కాగా ఈ సినిమాల ద్వారా ఈ ఏడాదిలో సాధించిన ఘన విజయాల వల్ల బాలకృష్ణ తిరుగులేని స్టార్ హీరోగా అవతరించారు. 1986 సంవత్సరంలో విడుదలైన సినిమాల ద్వారా బాలకృష్ణ అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 1986 సంవత్సరంలో బాలయ్య నటించిన సినిమాలలో ఏకంగా ఏడు సినిమాలు విడుదలయ్యాయి.

1986 సంవత్సరంలో బాలయ్య నటించి ఫ్లాప్ అయిన సినిమా నిప్పులాంటి మనిషి కావడం గమనార్హం. ఈ సినిమా ఫ్లాపైనా ముద్దుల కృష్ణయ్య సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అదే ఏడాది విడుదలైన సీతారామ కళ్యాణం సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను సొంతం చేసుకుంది. అప్పట్లో ఈ సినిమా స్టేట్ రికార్డులు క్రియేట్ చేసింది. అదే ఏడాది బాలయ్య నటించిన అనసూయమ్మ గారి అల్లుడు విడుదలైంది.

ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత బాలయ్య నటించి విడుదలైన దేశోద్ధారకుడు సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. షిఫ్ట్ లతో ఈ సినిమా 100 రోజుల పాటు ప్రదర్శించబడటం గమనార్హం. కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరులు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడం గమనార్హం.