స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఆస్తుల విలువ అన్ని కోట్లా?

నట సింహం నందమూరి బాలకృష్ణకు మాస్ ఫ్యాన్స్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. బాలయ్య సినిమా విడుదలైతే సీడెడ్ ఏరియాలో ఉండే సందడి అంతాఇంతా కాదు. బాలయ్య ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారనే సంగతి తెలిసిందే. అయితే బాలయ్య సినిమాల ద్వారా భారీగానే ఆస్తులు కూడబెట్టారని సమాచారం. బాలయ్యకు తండ్రి నుంచి వారసత్వంగా కోట్ల రూపాయల ఆస్తులు వచ్చాయని తెలుస్తోంది.

బాలయ్య బాబు మొత్తం ఆస్తుల విలువ 325 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. హైదరాబాద్ లో బాలయ్యకు ఖరీదైన బంగ్లా ఉండగా ఈ బంగ్లా విలువ 30 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. బాలయ్య దగ్గర ఖరీదైన కార్లు ఉన్నాయని బాలయ్య కార్ల విలువ కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది. బాలయ్య భార్య, కొడుకు పేర్లపై షేర్లు కూడా ఉన్నాయని సమాచారం అందుతోంది.

బాలయ్య దగ్గర 400 గ్రాముల బంగారం 5 కిలోల వెండి ఉందని తెలుస్తోంది. బాలయ్య భార్య దగ్గర 3487 గ్రాముల బంగారం ఉందని సమాచారం. ఈ బంగారంతో పాటు ఆమె దగ్గర 300 క్యారెట్ల వజ్రాలు, 31 కిలోల వెండి కూడా ఉన్నాయని తెలుస్తోంది. బాలయ్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఆర్థిక వ్యవహారాలను సైతం బాలయ్యే స్వయంగా చూసుకుంటారని సమాచారం అందుతోంది.

గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో మాస్ రోల్ లో బాలయ్య ఒక సినిమాలో నటిస్తుండగా పెద్దాయన, అన్నగారు టైటిల్స్ ను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు. ఈ రెండు టైటిల్స్ లో ఏదో ఒక టైటిల్ ఫిక్స్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అన్నగారు టైటిల్ ఈ సినిమాకు బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ టైటిల్ నే ఈ సినిమాకు ఫిక్స్ చేస్తారేమో చూడాల్సి ఉంది.